పేషంట్ 100 వ పుట్టిన రోజును ఘనంగా జరిపిన అపోలో యాజమాన్యం.. పిక్స్ వైరల్

Satvika
మెగా హీరో రామ్ చరణ్ భార్య, మెగా కోడలు ఉపాసనకొణిదెల.. ఈమెకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. అందరికీ సుపరిచితురాలే. మెగా కోడలుగా కన్న ఆమె చేస్తున్న సేవల ద్వారా, సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరికీ దగ్గరైంది. లాక్ డౌన్ సమయంలో ఈమె చేసిన సాయం అద్బుతం అంటూ చాలా  మంది సినీ , రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఇది ఇలా ఉండగా అపోలో ఆస్పత్రిలో కరోనా రోగులకు చికిత్స ను అందిస్తున్నారు. 


ఈ మేరకు ఓ రోగి 99 ఏళ్లు పూర్తి చేసుకొని 100 వ పుట్టిన రోజులోకి అడుగు పెట్టింది. ఈ సందర్బంగా ఆసుపత్రి యాజమాన్యం, సిబ్బందులు కలిసి ఆమె పుట్టిన రోజు వేడుకలను ఆసుపత్రి ప్రాంగణంలో నిర్వహించారు.ఈ విషయాన్ని ఉపాసన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఫొటో కూడా షేర్ చేశారు.ఉపాసన అంత ప్రత్యేకంగా చెప్పడానికి కారణం కూడా ఉందట..ప్రస్తుతం కరోనా వ్యాప్తి చాలా ఎక్కువగా ఉంది. ఈ వైరస్ చాలా మందికి సోకుతోంది. అయితే, కరోనా సోకిన వారి పట్ల ఈ సమాజం వివక్ష చూపుతోంది. వారిని అంటరానివాళ్లుగా కొంత మంది చూస్తున్నారు. అలాంటి వాళ్లలో మార్పు తీసుకొచ్చేందుకే కరోనా రోగి 100వ పుట్టినరోజు వేడుకను ఉపాసన బయటపెట్టాల్సి వచ్చింది. అలాగే ప్రజలు పోరాడాల్సింది కరోనా తో గాని .. రోగితో కాదని మరోసారి నిరూపించారు.



అదేవిధంగా మనకు జీవిత పాఠాన్ని నేర్పే ఒక ఆనంద క్షణం ఈరోజు అపోలో హాస్పిటల్స్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రియమైన మహిళ మనతో తన 100 పుట్టినరోజును జరుపుకున్నారు. ఆమె కొవిడ్ పేషెంట్. ప్రస్తుతం కోలుకుంటున్నారు.. మనం మనసు ఎలా ఆలోచిస్తే అలా చేస్తారు..పాజిటివ్ మైండ్ సెట్ ఉంటే ఎటువంటిది అయిన సులువుగా మారుతుంది అని ఉపాసన చెప్పుకొచ్చింది.బాధ, నొప్పి మధ్య కూడా కొన్ని ఆనంద క్షణాలను గడపవచ్చు. దీనికి ఆ కేక్, బెలూన్స్ నిదర్శనం. ఇలా పుట్టిన రోజును షేర్ చేయాల్సిన అవసరం లేదు .. కానీ సమాజంలో ఇలాంటివి జరగకుండా ప్రజలు అంకిత భావాన్ని కలిగి ఉండాలని ఈ పోస్ట్ చేసినట్లు చెప్పుకొచ్చింది..ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: