చెర్రీకి జరిగిన న్యాయం... తారక్ కు ఇంకా జరగలేదా ?
ఆర్.ఆర్.ఆర్. విషయంలో చెర్రీకి జరిగిన న్యాయం... తారక్ కు ఇంకా జరగలేదని గత కొంతకాలంగా ఎన్టీఆర్ ఫ్యాన్ప్ గగ్గోలు పెడుతూనే ఉన్నారు. ఇది రోజురోజుకు పెరిగిపోతూ ఉండడంతో రాజమౌళి వెంటనే తేరుకుని వర్కింగ్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యే ప్రాసెస్ ను క్యాప్చర్ చేసి ప్రేక్షకుల ముందుకు వదిలాడు. ఇందుల్లో తారక్ బుల్లెట్ మీద, సైడ్ లో గుర్రం పోటీ పడి మరీ పరిగెత్తడం చూపించాడు. అందులోనూ ఫేడ్ అవుట్ షాట్ ను మన ముందు ఉంచాడు. దీని ద్వారా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను కూల్ చేశాడు.
రాజమౌళి ఇక్కడితో ఆగలేదు. మేకింగ్ విజువల్స్ ఎండింగ్ లో "వెయిట్ రామరాజు ఫర్ భీమ్ ఆన్ 22ND" అక్టోబర్ అంటూ హింట్ ఇచ్చాడు. అంటే తారక్ చేస్తున్న కొమరం భీం పాత్రకు రామరాజు పాత్రదారి చెర్రీ వాయిస్ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే చెర్రీ చేస్తున్న మన్నెందొర అల్లూరి రోల్ కు తారక్ అద్భుతమైన వాయిస్ ను అందించి సీన్ రక్తి కట్టించాడు. ఆ ఒక్క టీజర్ తో సినిమాకు ఎంతో హైప్ తెచ్చాడు.
ఇక ఎటొచ్చి తారక్ చేసే కొమరం భీం పాత్రకు చెర్రీ ఎలాంటి పిచ్ తో వాయిస్ ఇస్తాడనేదే అందరూ ఎదురుచూస్తున్నారు.తారక్ ని వాయిస్ కు ఏమాత్రం తగ్గకుండా చెర్రీ వాయిస్ ఉంటుందంటున్నారు. దసరా గిఫ్ట్ గా ఈ వాయిస్ ను తెలుగు ప్రేక్షకులు కాస్త ఎక్కువగానే ఫీల్ అవుతారని యూనిట్ చెబుతుంది. అయితే చెర్రీ వాయిస్ లెవెల్ కాస్త "లోలెవెల్" లో ఉంటుంది. తారక్ వాయిస్ ఎంతో ఎనర్జీగా ఉంటుంది. మరి ముందొచ్చిన వాయిస్ కు దసరాకు చెర్రీ నుంచి వచ్చే వాయిస్ కు ఇద్దరి హీరోల ఫ్యాన్స్ కశ్చితంగా కంపారిజన్స్ లెక్కలు తీస్తారు. ఇదే ఇప్పుడు జక్కన్నకు కత్తిమీద సాములా మారింది. కాస్త రిజర్వ్డ్ డ్ గా సాగే చెర్రీ వాయిస్ ను జక్కన్న ఏదో విధంగా మాయచేసి ప్రేక్షకులను స్పెల్ బౌండ్ చేస్తాడంటున్నారు.