ఆ సినిమాలు నాకెంతో సంతృప్తినిచ్చాయి :అనుష్క
ఈ సినిమా ఓటీటీ లో విడుదల అయి పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఇదిలా ఉంటె తాజాగా అనుష్క ట్విట్టర్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ టైమ్‌లో మీరు ఏం నేర్చుకున్నారని ఓ అభిమాని అడిగినప్పుడు ఈ విధంగా సమాధానం చెప్పింది. "జీవితం ఒక గాజుబొమ్మలా అతిసున్నితమైనది. పరిసరాలు ఎప్పుడూ మన ఆధీనంలో ఉండవు. అందరం ప్రతిక్షణం ఏదో తెలియని అనిశ్చితిలోనే జీవిస్తుంటాం. ఈ విషయం పట్ల స్పృహతో ఉంటూ మనుషులపై ప్రేమ కనబరుస్తూ ప్రతిక్షణాన్ని ఆనందమయం చేసుకోవాలి. లాక్‌డౌన్ కాలంలో నేను తెలుసుకున్న సత్యమిదే' అని చెప్పింది సీనియర్ కథానాయిక అనుష్కశెట్టి. ఇటీవలే ఈ మంగళూరు అమ్మడు ట్విట్టర్‌లో జాయిన్ అయింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది.
తన జీవితంలో ఎప్పుడూ పశ్చాత్తాప పడిన సందర్భం లేదని, అంతా కోరుకున్న విధంగానే జరిగిందని..కెరీర్‌లో ఈ స్థాయికి రావడం గొప్పవరంగా భావిస్తున్నానని తెలిపింది.తన కెరీర్‌లో సూపర్, అరుంధతి, వేదం, రుద్రమదేవి, భాగమతి, సైజ్‌జీరో, బాహుబలి, నిశ్శబ్దం చిత్రాలు వ్యక్తిగతంగా సంతృప్తినిచ్చాయని పేర్కొంది.ప్రభాస్‌తో కలిసి మళ్లీ ఎప్పుడు నటిస్తారని ఓ అభిమాని అడగ్గా.. ఇద్దరికి సరిపోయే కథ కుదిరితే తప్పకుండా ఇద్దరి జోడీని తెరపై మరలా చూస్తారని బదులిచ్చింది.దీంతో మళ్ళీ అనుష్కకు.. ప్రభాస్ తో నటించడం ఇష్టమేనని... ఇక అభిమానులు కూడా వీరిద్దరి కలయికలో మళ్ళీ సినిమా వస్తే బాగుంటుందని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.