స్వాతి దీక్షిత్ కు బుల్లెట్ దించారు.. ఈ సస్పెన్స్ ఏంటి నాగార్జున గారు..?

shami
బిగ్ బాస్ సీజన్ 4 ఆడియెన్స్ లో ఆసక్తి పెంచేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు నిర్వాహకులు. నాలుగు వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ సీజన్ 4 నుండి నాలుగవ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ అయ్యారని నాగ్ ప్రకటించారు. ప్రతివారం సేఫ్ అయిన వారందరిని ముందు చెప్పి ఆ తర్వాత ఎలిమినేట్ అయినట్టుగా చివరికి ఒకరిని ప్రకటిస్తారు. కాని ఈసారి బుల్లెట్ దించి స్వాతి దీక్షిత్ ను ఎలిమినేట్ అనేశాడు నాగ్.
ఇంతకీ స్వాతి దీక్షిత్ నిజంగానే ఎలిమినేట్ అయినట్టా. అదేంటి ఇంకా ఎందుకు ఆ డౌట్ అనుకోవచ్చు. స్వాతి ఎలిమినేట్ అయ్యింది. కాని మిగతా హౌజ్ మేట్స్ ను సేఫ్ అనలేదు నాగ్. అంటే ఆదివారం ఎపిసోడ్ లో మరో ఎలిమినేషన్ ఉంటుందా లేక స్వాతిని ఎలిమినేట్ అని ట్విస్ట్ ఇచ్చి ఫైనల్ గా ఆమెను సీక్రెట్ రూం లో ఉంచి మిగిలిన ఆరుగురిలో ఎవరినైనా ఎలిమినేట్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. బిగ్ బాస్ లో ఏదైనా జరగొచ్చు. కాబట్టి ఎవరం ఊహించలేము.
ఓ పక్క ఐపిఎల్ సీజన్ ను తట్టుకునేలా టాస్కులు ఇంట్రెస్టింగ్ గా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక మిగిలిన ఆరుగులో మరొకరిని ఈరోజు ఎలిమినేట్ చేస్తారా.. బిగ్ బాస్ లో ఈరోజు ఏం జరగబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. శనివారం ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైన్ చేయగా ఆదివారం ఆ ఎంటర్టైన్మెంట్ డబుల్ అందించేందుకు రెడీ అని తెలుస్తుంది.                                                                         

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: