ఆదిపురుష్ కోసం విజయేంద్ర ప్రసాద్.. బాహుబలి రైటర్ ఎంటర్ అయ్యాడంటే ఇక రచ్చ మొదలైనట్టే..!

shami
ఓం రౌత్ డైరక్షన్ లో ప్రభాస్ లీడ్ రోల్ లో వస్తున్న సినిమా ఆదిపురుష్. ఈ సినిమాను 2021 జనవరి నుండి సెట్స్ మీదకు తీసుకెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నారు చిత్రయూనిట్. టీ సీరీస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడుగా నటిస్తున్నాడని తెలుస్తుంది. అంతేకాదు సినిమాలో రావణుడి పాత్రలో సైఫ్ ఆలి ఖాన్ నటిస్తున్నట్టు ప్రకటించారు. ఇదిలాఉంటే ఆదిపురుష్ సినిమా కోసం స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ పనిచేస్తారని లేటెస్ట్ న్యూస్.  

ఆదిపురుష్ స్టోరీ, స్క్రీన్ ప్లే విషయంలో విజయేంద్ర ప్రసాద్ సహాయం తీసుకోబోతున్నారట చిత్రయూనిట్. కచ్చితంగా ఇది మంచి నిర్ణయమని చెప్పొచ్చు. ఆదిపురుష్ లో విజయేంద్ర ప్రసాద్ హ్యాండ్ పడితే ఆ ఎఫెక్ట్ సినిమా మీద చాలా ఉంటుంది. బాహుబలి రైటర్ గా ఆల్రెడీ ప్రభాస్ ను ఎలా చూపించాలో తెలిసిన రైటర్ విజయేంద్ర ప్రసాద్.. ఆదిపురుష్ కు ప్లస్ అవుతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ప్రస్తుతం రాధే శ్యాం సినిమా చేస్తున్న ప్రభాస్ ఆ సినిమా తర్వాత ఆదిపురుష్ షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఆదిపురుష్ కోసం కేవలం 60 రోజుల డేట్స్ మాత్రమే ఇచ్చాడట ప్రభాస్. అంతేకాదు ఈ సినిమా కోసం ప్రభాస్ 100 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్. మరి ఇన్ని హంగులతో వస్తున్న ఆదిపురుష్ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. ఆదిపురుష్ పూర్తి చేయడమే ఆలస్యం ఆ వెంటనే నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్షన్ మూవీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు ప్రభాస్.                                                                   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: