కుమార్ సాయి మొత్తానికి సాధించాడు..దెబ్బకు అందరి తిక్క కుదిరింది..
నాలుగో వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ పక్రీయ రచ్చల మద్య పూర్తి చేసింది. ఈ వారం కెప్టెన్సీ కోసం ఇంటి సభ్యులు మధ్య బిగ్ బాస్ గట్టి పోటీని పెట్టింది.కిల్లర్ కాయిన్స్’ టాస్క్ తొలి దశ పూర్తికాగా.. రెండో దశ రంజుగా సాగుతుంది. ఇక బుధవారం నాటి ఎపిసోడ్‌లో రాజశేఖర్ మాస్టర్‌తో గొడవకు దిగిన సొహైల్ మాస్టర్ చేతులు పట్టుకుని సారీ చెప్పాడు.ఇక కాయిన్స్ కోసం తలపడుతున్న అవినాష్ కాలికి బలమైన గాయం తగలడంతో అతను తప్ప మిగిలిన వాళ్ళు టాస్క్ ను పూర్తి చేయాలని బిగ్ బాస్ కోరారు.
అయితే అందరూ కాయిన్స్ కోసం తెగ హంగామా చేశారు.. నువ్వా నేనా అంటూ గొడవలకు దిగారు. కానీ ఏం జరిగిన కూడా బిగ్ బాస్ అనుకున్నది చేస్తాడు అని మరోసారి రుజువైంది.సేఫ్ గేమ్ ఆడిన హారిక, సుజాత, రాజశేఖర్‌లు కెప్టెన్ పోటీదారులుగా నిలవడం విడ్డూరంగా అనిపించింది.టాస్క్ మొదలైనప్పటి నుంచి కుమార్ సాయి బాగానే కష్టపడ్డాడు. బరిలో ఉన్న ముగ్గురిని పక్కన పెట్టి కుమార్ సాయిని కెప్టెన్ గా అనౌన్స్ చేశారు బిగ్ బాస్.పాపం కెప్టెన్ అవుతామని కష్టపడిన వారందరి కష్టం బురదలో పోసిన పన్నీరు అయ్యింది. రొమాన్స్ మాత్రం ఇంటి సభ్యులకు బాగా కలిసొచ్చింది.అర్థరాత్రి 12 గంటలు అని బిగ్ బాస్ నుంచి అనౌన్స్ మెంట్ వచ్చినా.. అఖిల్, మొనాల్‌లు రొమాన్స్‌కి తెరతీశారు. ఇక ఈ వారం ఎలిమినేట్ అయ్యేది హారిక అని అంటున్నారు. మరి హారిక అవుతుందా లేక ఎవరైనా అవుతారా అనేది ఈ వారం ఎండింగ్ లో తెలుస్తుంది.