నితిన్ సినిమా నుండి క్రేజీ అప్డేట్ రాబోతుంది..!

shami
ఈ ఇయర్ మొదట్లోనే భీష్మ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నితిన్ తన నెక్స్ట్ సినిమా రంగ్ దే దాదాపు పూర్తి కావొచ్చింది. వెంకీ అట్లూరి డైరక్షన్ లో తెరకెక్కుతున్న రంగ్ దే సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. ఈ సినిమా తర్వాత నితిన్ అందాదున్ రీమేక్ కూడా షురూ చేశాడు. వీటితో పాటుగా చంద్రశేఖర్ యేలేటి సినిమా కూడా సెట్స్ మీద ఉంది. ఆల్రెడీ కొంత షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా నుండి క్రేజీ అప్డేట్ రేపు సాయంత్రం 4:30 గంటలకు రానుందని తెలుస్తుంది.  

భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ మెంట్ రేపు వస్తుందని అంటున్నారు. ఈ సినిమాకు చదరంగం అని పెట్టే ఆలోచనలో ఉన్నట్టు టాక్. అదే టైటిల్ పోస్టర్ రేపు ఎనౌన్స్ చేయొచ్చని అంచనా. నితిన్, చంద్రశేఖర్ యేలేటి క్రేజీ కాంబోతో ఈ సినిమా వస్తుంది. సినిమా తప్పకుండా ఆడియెన్స్ ను అలరించేలా ఉంటుందని అంటున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాలో నితిన్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.    

భీష్మ హిట్ తో కెరియర్ లో మళ్ళీ జోష్ నింపుకున్న నితిన్ రంగ్ దే కూడా అదే జోష్ కనబరిచేలా ఉన్నాడు. వెంకీ మార్క్ ఎంటర్టైనర్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ కీర్తి సురేష్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. రంగ్ దే, అందాదున్ రీమేక్, చందరంగం మూడు క్రేజీ ప్రాజెక్టులతో నితిన్ ఈసారి తన సత్తా చాటనున్నాడని చెప్పొచ్చు.                         


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: