సోషల్ మీడియా వేదికగా తన భార్యకి బర్త్ డే విషెస్ తెలిపిన బన్నీ...!

Anilkumar
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు మెగా హీరో అల్లు అర్జున్.తన నటన, డాన్స్..మాత్రమే కాదు.. సినిమా.. సినిమాకీ కొత్త మేకోవర్ ని ట్రై చేస్తూ, ప్రతీ ఒక్క సినిమాలో చాలా అందంగా, స్టైలిష్ గా కనబడుతూ.. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ మారిపోయాడు. అలాంటి మన బన్నీ కి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే అని చెప్పాలి. ఇక బన్నీ మాత్రం సైలెంట్ గా 2011లో తాను ప్రేమించిన స్నేహ రెడ్డిని వివాహం చేసుకున్నాడు.


 ఇక ప్రస్తుతం  టాలీవుడ్‌లోని మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌లో అల్లు అర్జున్, స్నేహ జోడీ ఒకటి.వీళ్లిద్దరి జోడీని చూడటానికి నిజంగా రెండు కళ్ళు చాలవు. అంత బ్యూటిఫుల్ జోడి వీరిది. ఇప్పటికే పలు సామాజిక మాధ్యమాల్లో ఈ జోడికి సంబంధించిన చాలా ఫోటోలు, వీడియోలు ఎంత వైరల్ అయ్యాయి8ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక తాజాగా జన్మదినోత్సవం జరుపుకున్న స్నేహకు బన్నీ సోషల్ మీడియా ద్వారా విషెస్ చెప్పాడు.స్నేహ కేక్ కట్ చేస్తున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. `నా జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఇలాగే ఎన్నో బర్త్‌డేలను మనం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నా.


హ్యాపీ బర్త్‌డే క్యూటీ` అని బన్నీ కామెంట్ చేశాడు.ప్రస్తుతం బన్నీ, స్నేహాల బర్త్ డే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలను చూసిన మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతూ.. హ్యాపీ బర్త్ డే వదినమ్మ అంటూ సోషల్ మీడియా ద్వారా స్నేహాకి విషెస్ తెలుపుతున్నారు.ఇక బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ కెరియర్ లో మొట్ట మొదటి పాన్ ఇండియా సినిమాగా పుష్ప తెరకెక్కుతోంది. తెలుగుతో పాటు.. హిందీ, తమిళ, కన్నడ,మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా విడుదల కాబోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: