మెగాస్టార్ చిరంజీవి నట వారసత్వంతో తొలిసారిగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిరుత సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరో గా ఎంట్రీ ఇచ్చాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అప్పట్లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఆ సినిమా సక్సెస్ ని అందుకోవడం జరిగింది. దాని అనంతరం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మగధీర సినిమాలో నటించి దానితో ఏకంగా పెద్ద బ్లాక్ బస్టర్ దక్కించుకున్నారు చరణ్. ఇక అక్కడి నుండి వరుస అవకాశాలతో కొనసాగిన చరణ్ తన ఆకట్టుకునే నటనతో ఎందరో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు.
ఇక ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమాలో చెవిటివాడైన చిట్టిబాబు పాత్రలో నటించి తన సహజమైన నటనతో ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్న చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీ లో మరొక హీరో ఎన్టీఆర్ తో కలిసి నటిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నారు. ఇక దీని అనంతరం రామ్ చరణ్, తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ మూవీ ఘరానా మొగుడు రీమేక్ లో నటించనున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్.1992లో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో అతి పెద్ద సంచలన విజయం అందుకుంది.
నగ్మా, వాణి విశ్వనాథ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమానిని కె. దేవివరప్రసాద్ నిర్మించారు. ఇటీవల కొద్ది రోజుల క్రితం నుండి ఈ సినిమా రీమేక్ కు సంబంధించి ఒక టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో పనులు కొనసాగుతున్నాయని అలానే ఒక యువ దర్శకుడు ఈ సినిమా కథను ప్రస్తుత కాలానికి సంబంధించి కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసి సిద్ధం చేసినట్లు టాక్. అలాగే అతి త్వరలో చరణ్ ని కలిసి ఈ రీమేక్ కథను వినిపించనున్నారని, అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా పటాలెక్కే ఛాన్స్ ఉందని టాక్. మరి ప్రస్తుతం ఘరానా మొగుడు సినిమా రీమేక్ విషయమై ప్రచారం అవుతున్న ఈ వార్తలో పూర్తి నిజానిజాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు...!!