బిగ్ బాస్ 4 : దేవి నాగవల్లి ఎలిమినేట్..?

shami
బిగ్ బాస్ సీజన్ 4 ఈ వారం ఎవరు ఇంటి నుండి బయటకు వస్తున్నారు అన్నది ఆసక్తిగా మారింది. నిన్నటిదాకా మెహబూ, అరియానాలలో ఒకరు హౌజ్ నుండి బయటకు వస్తున్నట్టు చెప్పుకోగా సడెన్ గా చివరి నిమిషంలో దేవి నాగవల్లి హౌజ్ నుండి ఎగ్జిట్ అయినట్టు తెలుస్తుంది. హౌజ్ లో ఆమె అందరి ఆలోచనలకు భిన్నంగా ప్రవర్తిస్తుంది. అయితే మూడవ వారమే వచ్చే హౌజ్ మేట్ అయితే ఆమె కాదు.

కాని మూడవ వారం ఉక్కు హృదయం టాస్క్ లో ఆమె పర్ఫార్మెన్స్ డల్ గా ఉండటం.. మిగతా కారణాల వల్ల ఆడియెన్స్ ఆమెకు ఓట్లు వేయలేదట. ఫైనల్ గా బిగ్ బాస్ సీజన్ మూడవ ఎలిమినేటర్ గా దేవి నాగవల్లి ఎగ్జిట్ అయినట్టు తెలుస్తుంది. ఆదివారం ఎపిసోడ్ లో హౌజ్ నుండి బయటకు ఎవరు వస్తారన్నది సస్పెన్స్ గా మారింది.

బిగ్ బాస్ 4లో నాగ వల్లి నిజంగానే ఎగ్జిట్ అవుతుందా.. ఆమెకు ఆడియెన్స్ ఎందుకు ఓట్లు వేయలేదు. దేవి నాగవల్లి ఎలిమినేషన్ రియలా.. ఫేకా.. అసలు ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమేనా కాదా అన్నది తెలియాలంటే ఈరోజు ఎపిసొడ్ చూడాల్సిందే. ఈ సండే ఎపిసోడ్ ప్రోమో హంగామా బాగుంది. ఆరంభం అదరగొట్టిన ఈ వారం ఎపిసోడ్ ఆడియెన్స్ కు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలా ఉంది.

హౌజ్ మేట్స్ అందరితో ఫన్నీ టాస్కులను చేయించి ఆడించాడు నాగార్జున. హోస్ట్ గా నాగార్జున కూడా ఈరోజు జోష్ ఫుల్ గా కనిపించారు. ఆడియెన్స్ కూడా షో మీద ఇప్పుడిప్పుడే ఆసక్తి పెంచుకుంటున్నారు.                                                          


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: