ట్రోల్స్ పై వితిక మార్క్ పంచ్..!

shami
బిగ్ బాస్ సీజన్ 4 మొదలవగానే తమకు ఇష్టమైన కంటెస్టంట్స్ ను సపోర్ట్ చేస్తూ.. కొంతమంది కంటెస్టంట్స్ ను ట్రోల్స్ చేస్తూ అప్పుడే సోషల్ మీడియాలో హంగామా మొదలైంది. సీజన్ 4 కూడా రెండు వారాలు పూర్తి కావొస్తుంది. అయితే సీజన్ 4 నడుస్తున టైంలో సీజన్ 3 కంటెస్టంట్ వితిక ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది. 24 గంటలు జరిగే బిగ్ బాస్ షోలో రోజుకి షో 1 అవర్ మాత్రమే చూపిస్తారు. అయితే అక్కడ జరిగేది ఒకటి అయితే మరోలా చూపిస్తారు. అయితే దాని వల్ల హౌజ్ మేట్స్ మీద ఓ అభిప్రాయం ఏర్పడుతుంది.
అంతేకాదు హౌజ్ లో నుండి బయటకు వచ్చిన తనకు అనుకోని సమస్యలు ఎదురయ్యాయని చెప్పుకొచ్చింది వితిక. బిగ్ బాస్ లో 70 రోజుల పాటు ఉన్న తనకు బయటకు వచ్చాక తన మీద సోషల్ మీడియాలో చేస్తున్న ట్రోల్స్ చూసి సూసైడ్ చేసుకుందామని అనుకున్నానని అన్నారు వితిక. మీకు నచ్చిన కంటెస్టంట్ ఉంటే ఓట్ చేయండి ప్రమోట్ చేయండి కాని అలా అని నచ్చిన వారి కోసం నచ్చని కంటెస్టంట్ గురించి ట్రోల్స్, మేంస్ వేయడం కరెక్ట్ కాదని అన్నారు వితిక.
బిగ్ బాస్ లో ఆట తాము ఒక్కరమే ఆడితే బయట వస్తున్న ట్రోల్స్ చూసి తమ ఇంటి సభ్యులు బాధపడతారని చెప్పుకొచ్చారు వితిక. బిగ్ బాస్ నుండి వచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియాలో వస్తున్న విమర్శల.. కొన్ని కామెంట్స్ నుండి బయటపడటానికి తనకు 3 నెలలు దాకా పట్టిందని అన్నారు వితిక. సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టుకున్న వితిక బిగ్ బాస్ షో కాన్సెప్ట్ ను తప్పుపట్టలేదు కాని షో కోసం కొందరు పెయిడ్ గ్రూపులు చేసే నీచమైన నెగటివ్ ప్రమొషన్ పై గొంతు విప్పారు. వితిక పెట్టిన ఈ వీడియోకి అదే సీజన్ లో మరో హౌజ్ మేట్ జ్యోతి సపోర్ట్ చేయగా.. సెకండ్ సీజన్ లో రన్నర్ గా నిలిచిన గీతా మాధురి కూడా తనకు కూడా ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయని త్వరలోనే తను కూడా ఇలాంటి ఓ వీడియో పెడతా అని అన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: