బన్నీ, చరణ్ మాత్రమేనా.. వరుణ్ తేజ్ కూడా రష్మికతోనే..!

shami
మెగా హీరోలతో ఒక్క హిట్టు సినిమా పడితే ఆ హీరోయిన్ ఫేట్ మారినట్టే లెక్క. అల్లు అర్జున్ డిజే చేసిన తర్వాతనే పూజా హెగ్దే చాలా పాపులర్ అయ్యింది. వరుస స్టార్ ఛాన్సులు అందుకుంటుంది. అయితే ఇప్పుడు రష్మిక మందన్న కూడా వరుసగా మెగా హీరోలతో సినిమాలు చేస్తుందని తెలుస్తుంది. ఆల్రెడీ రష్మిక స్టార్ క్రేజ్ వచ్చాకనే మెగా హీరోలతో చేస్తుంది కాబట్టి ఆమె ఇమేజ్ డబుల్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి.
ఈ ఇయర్ మొదట్లోనే సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాతో హిట్ అందుకున్న రష్మిక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్పలో ఛాన్స్ అందుకుంది. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఆచార్యలో రాం చరణ్ కు జోడీగా రష్మికనే నటిస్తుందని తెలుస్తుంది.  ఇదే కాకుండా లేటెస్ట్ గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన కూడా రష్మిక ఛాన్స్ కొట్టేసిందని టాక్. కిరణ్ డైరక్షన్ లో వరుణ్ తేజ్ నటిస్తున్న బాక్సర్ సినిమాలో ముందు సాయి మంజ్రేకర్ ను హీరోయిన్ గా అనుకున్నారు. కాని ఆమె ఇప్పుడు ఈ సినిమా చేయనని అంటుందట.
అందుకే రష్మికను బాక్సర్ మూవీ యూనిట్ హీరోయిన్ గా ఫిక్స్ చేశారని తెలుస్తుంది. ఈ సినిమాను అల్లు బాబి నిర్మిస్తున్నరు. మెగా హీరోల సినిమాలే కాదు రష్మిక అక్కినేని అఖిల్ సినిమా చేస్తుందని కూడా తెలుస్తుంది. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో అఖిల్ తో కూడా రొమాన్స్ చేసేందుకు సిద్ధమైంది రష్మిక. టాలీవుడ్ లో అమ్మడు వరుస ఆఫర్లతో టాపు లేపేస్తుందని చెప్పొచ్చు.                                                       

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: