
బిగ్ బాస్ 4: అరియానా కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన నోయల్... ఏంటో చూడండి !
ఫస్ట్ డే స్టైల్‌లోనే పొరుగింటి బ్యాచ్.. బిగ్‌బాస్ హౌస్‌కి కాల్ చేసింది. ఆరియానా చేసిన కాల్‌ను అఖిల్ అటెండ్ చేశాడు. ఆరియానా హస్కీ వాయిస్ విని, పులిహోర కలపడం మొదలుపెట్టాడు. ‘మీరు ఇంత స్వీట్‌గా మాట్లాడుతారు అంటే మీకు ఇంకా ఎక్స్‌ట్రా కూర పంపిస్తాం’ అని మాటలు కోటలు కట్టేశాడు. దానికి ఆరియానా వదిలేయకుండా ‘ఇది కొంచెం సీరియస్‌గా వినండి… ఇది మీ ఇంటి మొత్తానికి సంబంధించింది’ అని చెప్పింది. ఆ తర్వాతే ప్రోమో ట్విస్ట్ వచ్చింది.
అఖిల్ నుంచి ఫోన్ అందుకున్న నోయల్ ‘ఏంది ప్రాబ్లం’ అనగానే ఆరియానా మైండ్ బ్లాక్ అయిపోయింది. ‘మీరు మర్యాదగా అడిగితే.. మేం మర్యాదగా పంపిస్తాం’ అంటూ నోయల్ కంటిన్యూ చేశాడు. దానికి ఆరియానా ‘ఆ ష్యూర్ అండి.. మీ పేరు’ అంటూ సాగదీసింది. ఆ మాటకు నోయల్ భలే ఝలక్ ఇచ్చాడు. ‘నా పేరు గూగుల్ చేసుకో.. అర్థమైందా బాయ్’ అంటూ ఫోన్ పెట్టేశాడు. అక్కడ బిగ్‌బాస్ హౌస్‌లో నవ్వులు పూయగా, ఇక్కడ నైబర్ హౌస్‌లో ఫేస్‌లు బ్లాంక్ అయిపోయాయి. ‘అదేందే అట్లా కట్ చేసిర్రు’ అంటూ సోహైల్ క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టాడు.
బిగ్ బాస్ 4 షో లో హీరోయిన్ మోనాల్ గజ్జర్,సైడ్ యాక్టర్ కరాటే కల్యాణి, యు ట్యూబర్ అలేఖ్య హారిక, గంగవ్వ, డైరెక్టర్ సూర్య కిరణ్, యు ట్యూబర్ మెహబూబ్ దిల్ సే, టీ వి 9 న్యూస్ రిపోర్టర్ దేవి, యాంకర్ అరియానా గ్లోరీ, సింగర్ అండ్ యాక్టర్ నోయల్ సీయోన్, యాంకర్ లాస్య, హీరో అభిజిత్, హీరోయిన్ దివి, డైరెక్టర్ అమ్మ రాజశేఖర్, టీవీ యాక్టర్ అఖిల్ సార్థక్, టీవీ యాక్టర్ సోహెల్ తదితరులు బిగ్ బాస్ హౌస్ మేట్స్ గా కొనసాగుతున్నారు.