తొలిసారిగా మహేష్ ప్రక్కన జోడీ కడుతోన్న ప్రభాస్ హీరోయిన్ ....??

GVK Writings
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అతి త్వరలో తెరకెక్కనున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. ఇటీవల విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ల కలయికలో తెరకెక్కిన గీతా గోవిందం సూపర్ హిట్ మూవీ కి దర్శకత్వం వహించిన పరశురామ్ పెట్ల ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. తొలిసారిగా మహేష్ బాబు కు జోడిగా మహానటి మూవీ ఫేమ్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తుండగా మది ఫోటోగ్రఫీ అందించనున్నారు.
ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినం సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కు సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల నుండి కూడా మంచి స్పందన లభించింది. 14 రీల్స్ ప్లస్, జి.ఎమ్.బి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు కలిసి అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో ఎంతో భారీగా నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ ని వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చూస్తున్నారట. ఇక దీని అనంతరం దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో కె.ఎల్.నారాయణ నిర్మాతగా దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై మహేష్ బాబు సినిమా చేయనున్న విషయం తెలిసిందే. దాని తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు కలిసి నిర్మించనున్న  ఒక భారీ సినిమాలో మహేష్ నటించనున్నారని కొద్దిరోజులుగా పలు ఫిల్మ్ నగర్ వర్గాల్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

కాగా ఈ సినిమా కథ ఇటీవలే పూర్తయిందని, అతి త్వరలో మహేష్ బాబుకు దానిని వినిపించి గ్రీన్సిగ్నల్ అందుకోనున్నారట త్రివిక్రమ్. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఇటీవల ప్రభాస్ సరసన సాహో లో నటించి మంచి పేరు దక్కించుకున్న బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ నటించనున్నట్లు చెబుతున్నారు. గతంలో ఒకసారి మహేష్ బాబు పక్కన నటించే ఛాన్స్ శ్రద్ధాకు వచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదని, కాగా ఈసారి తప్పకుండా  మహేష్ పక్కన ఆమెను నటింపజేసేందుకు త్రివిక్రమ్ కూడా సిద్ధమయ్యారని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక ఒకవేళ నిజమైతే తొలిసారిగా సూపర్ స్టార్ మహేష్ బాబు బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ల జోడిని వెండితెరపై చూడవచ్చన్న మాట

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: