బుల్లితెర నటనపై వివరణ ఇచ్చిన కాజోల్

shami
బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ ఈ మధ్య మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఆమె బుల్లి తెర సీరియల్ లో నటించనున్నట్లు తెగ హడావిడి చేశాయి బీ టౌన్ మీడియా. కాని ఆమె మాత్రం దానికి రెడీగా లేను అని తేల్చి చెప్పేసింది. చాలా కాలంగా సిల్వర్ స్క్రీన్ కే దూరంగా ఉన్న కాజోల్ ఇప్పుడు డైరెక్ట్ గా టీ.వీ సీరియల్స్ లో నటిస్తుందని తెలిసిన ఆమె అభిమానులు తెగ సంబర పడ్డారు. కాని మీడియా సృష్టించిన ఈ హడావిడికి కాజోల్ సమాధానమిస్తూ ఇంకా టీ.వీ గురించి నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది. నేను ఏ పని చేసిన దాని గురించి పూర్తిగా తెలుసుకున్నాకే చేస్తా అని చెప్పింది. తనపై వచ్చిన రూమర్స్ ని కాజోల్ ఖండించింది. ఎపిహెరాల్డ్. కామ్ కి అందిన సమాచారం ప్రకారం కాజోల్ ని ఫర్ బ్రైడాల్సెన్ (ద కిల్లింగ్) అనే సీరియల్ లో ఇన్వెస్టిగేటివ్ రోల్ ని తను ప్లే చేస్తుందని వార్తలకు ఆమె పై విధంగా స్పందించింది.  సినిమాలకు దూరమైనా యాడ్స్ తో ఆడియెన్స్ ని అలరిస్తున్న కాజోల్ ఇప్పుడు సీరియల్స్ కూడా చేయబోతుంది. కాని ఆమె ఫ్యాన్స్ కూడా ఆమె ఆ సీరియల్ లో నటిస్తే చాలా బాగుంటుంది అని అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. సో ఏది ఏమైనా కాజోల్ ని బుల్లి తెర మీద కొద్ది రోజుల్లో చూడబోతున్నామనే మాట మాత్రం నిజమనే చెప్పాలి. వెండితెర మీద తన నటనతో సూపర్ క్రేజ్ సంపాధించిన కాజోల్ టీ.వీ సీరియల్స్ లో కూడా తన టాలెంట్ చూపిస్తుందనడంలో సందేహం లేదు. కాజోల్ సీరియల్స్ లో నటించడం పై మీ కామెంట్ ..? 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: