పవర్ స్టార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్న... సినీ ప్రముఖులు....

VAMSI
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో మొత్తం పవర్ స్టార్ నామమే ప్రతిధ్వనిస్తోంది.తమ్ముడు పుట్టినరోజు కి  ఆశీస్సులు అందిస్తూ  తన ప్రేమను  తెలియజేశాడు మెగాస్టార్ చిరంజీవి.తనువులు వేరైనా లక్ష్యం ఒక్కటే.. మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే.. తన గుండెచప్పుడు ఎప్పుడు జనమే. తన ఆశయం ఎల్లప్పుడూ జనహితమే. జనసేనానికి పుట్టినరోజు శుభాకాంక్షలు' అంటూ తమ్ముడి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు చిరు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరుపుకుంటూ  సందడి చేస్తున్నారు ఆయన అభిమానులు.

ఓవైపు అభిమానులు, ఇంకోవైపు కుటుంబ సభ్యులు, మరోవైపు సినీ ప్రముఖులు ప్రేమతో విషెస్ తెలియజేస్తూ ఉంటే. వారి ఎనలేని అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు పవన్. ప్రముఖ నటీనటులు, నిర్మాతలు డైరెక్టర్లు, పలువురు ప్రముఖులు... సోషల్ మీడియా ద్వారా పవర్ స్టార్  కు శుభాకాంక్షలను అందజేస్తున్నారు.
ఈ సందర్భంగా ప్రిన్స్ మహేష్ బాబు కూడా పవన్ కళ్యాణ్ కు సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెష్ అందించారు. ''మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్!! మీ దయాగుణం మరియు వినయం ఎల్లప్పుడూ మార్పును ప్రేరేపిస్తాయి. మీకు ఎల్లప్పుడూ సంతోషం, మంచి ఆరోగ్యం కలగాలని ఆకాంక్షిస్తున్నాను!!'' అంటూ విషెస్ తెలిపారు సూపర్ స్టార్ మహేష్ బాబు.


 ఈ సోషల్ మీడియా సందేశంతో పాటు పవన్ కళ్యాణ్ తో ఉన్న ఓ అరుదైన ఫొటోను కూడా మహేష్ షేర్ చేశారు. ఈ ఫోటోను చూసిన అభిమానులు పెద్ద ఎత్తున లైక్స్ కొడుతూ వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు పవన్, మహేష్... స్టార్ హీరోలిద్దరూ కలిసి ఓ సూపర్ మల్టీస్టారర్ మూవీ చేయాలని కామెంట్స్ పెడుతున్నారు. నిజానికి వీరిద్దరి మధ్య ఉన్న స్నేహ సంబంధాల గురించి అందరికీ తెలిసిందే కళ్యాణ్ నటించిన 'జల్సా' సినిమాకి మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఇటీవల కరోనా సహాయార్థం విరాళం ప్రకటించిన మహేష్ బాబు ను పవన్ గొప్ప పని చేశావు అంటూ ప్రశంసించారు. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా పవన్ కు తన శుభాకాంక్షలు సోషల్ మీడియా ద్వారా "హ్యాపీ బర్త్ డే మామ" అని చెప్పాడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: