ఇక తెలుగు హీరోలందరూ కూడా నిర్మాతల మాట వినాల్సిందేనా?

Suma Kallamadi
కరోనా మహమ్మారి భారతదేశంలో అడుగుపెట్టిన తర్వాత నిర్మాతలందరూ హీరోలను బతిలాడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు కూడా హీరో నాని ని చాలా రోజులు బతిలాడారని సమాచారం. కోన వెంకట్ కూడా నిశ్శబ్దం సినిమాని డిజిటల్ తెరపై విడుదల చేసేందుకు అంగీకరించ వలసిందిగా అనుష్క శెట్టి ని 50 రోజుల పాటు బతిమాలాడాడని సినీ వర్గాల్లో టాక్. ఐతే ఎట్టకేలకు నాని, అనుష్క శెట్టి తమ సినిమాలను ఓటీటీ లలో విడుదలకు పచ్చజెండా ఊపారు. హీరో నాని నటించిన వి సినిమా సెప్టెంబర్ నెల 5వ తేదీన విడుదల కానుంది. అనుష్క శెట్టి నటించిన నిశ్శబ్దం సినిమా వచ్చే నెలలో విడుదల కానుంది. ఐతే వీళ్ళిద్దరి అంగీకారంతో మిగతా సినిమా హీరోల పై కూడా ఒత్తిడి పడుతుంది.

బాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్లు కూడా తమ సినిమాలను ఓటీటీ లలో విడుదల చేసేందుకు పచ్చజెండా ఊపుతున్నారు. అక్షయ్ కుమార్,  అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, అలియా భట్, అజయ్ దేవగన్ తదితరులు నిర్మాతలపై అప్పుల భారం పెరిగి పోకూడదని తమ సినిమాల యొక్క డిజిటల్ రిలీజ్  లకు  ఓకే చెప్పేశారు. కోలీవుడ్ స్టార్ హీరోలు కూడా ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకొని నిర్మాతలను ఓటీటీ లో సినిమాలను విడుదల చేసేందుకు అంగీకరిస్తున్నారు.

భారత దేశ వ్యాప్తంగా అందరూ కూడా నిర్మాతలపై భారం తగ్గిస్తున్న నేపథ్యం లో తెలుగు హీరోలు కూడా అందరితో పాటే తాము అన్నట్టు నిర్మాతల నిర్ణయాలకు సానుకూలంగా స్పందించాల్సిన పరిస్థితి వస్తోంది. సినిమా థియేటర్లు తెరిచే లోపు కనీసం అయిదు, ఆరు నెలల సమయం పట్టొచ్చు. అంతలోపు ఎంతమంది తెలుగు హీరోలు నిర్మాతల మాటలను విని వారి పరిస్థితిని అర్థం చేసుకుని తాము నటించిన సినిమాలను డిజిటల్ తెరపై విడుదల చేసేందుకు అంగీకరిస్తారో చూడాలిక.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: