ఎన్టీఆర్ తో ఆయనకు ఇదే లాస్ట్ సినిమానా  ..... ??

GVK Writings
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదటగా నిన్ను చూడాలని సినిమాతో హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుని హీరోగా ఎన్టీఆర్ కు బ్రేక్ ని అందించింది. ఇక ఆ తరువాత మరొక్కసారి రాజమౌళితో ఎన్టీఆర్ చేసిన సింహాద్రి సినిమా సంచలన విజయాన్ని సాధించి ఆయనకు హీరోగా మరింత క్రేజ్ ని, మార్కెట్ ని ఏర్పరిచింది. అక్కడి నుండి వరుసగా అవకాశాలతో కొనసాగిన ఎన్టీఆర్, ఆ తరువాత రాజమౌళి తో చేసిన యమదొంగ సినిమా కూడా పెద్ద సక్సెస్ కొట్టి ఎన్టీఆర్, రాజమౌళిల కాంబినేషన్ కు మరింతగా క్రేజ్ తెచ్చిపెట్టింది.  
ఇక ఎన్నో ఏళ్ల గ్యాప్ అనంతరం ప్రస్తుతం రాజమౌళితో ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. మరొక హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఎన్టీఆర్ తొలిసారిగా నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ మూవీలో ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్నారు. ఎంతో భారీ ఖర్చుతో, హై టెక్నీకల్ వాల్యూస్ తో రూపొందుతున్న ఈ సినిమాని డివివి దానయ్య ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్నారు. మొదటి నుండి ఎన్టీఆర్ తో రాజమౌళికి వ్యక్తిగతంగా కూడా మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. తనకు ఫస్ట్ మూవీ ఛాన్స్ ఇచ్చిన ఎన్టీఆర్ అంటే రాజమౌళికి మరింత వల్లమాలిన అభిమానం కూడా.  

అయితే లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఆర్ఆర్ఆర్ అనంతరం మరొక్కసారి ఎన్టీఆర్ తో రాజమౌళి పని చేసే చాన్సు అసలు ఇప్పట్లో లేనట్లేనని, ఒకరకంగా ఇదే వారిద్దరి కాంబో లాస్ట్ సినిమా అని టాక్. దీని అనంతరం మహేష్ తో ఒక భారీ సినిమా తీయనున్న రాజమౌళి, దాని అనంతరం పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లతో సినిమాలు చేయనున్నారని, అవి మూడు పూర్తి కావడానికి మరొక ఆరేళ్ళ వరకు పట్టవచ్చని, ఈలోపు ఆయన డ్రీమ్ ప్రాజక్ట్ మహాభారతం పై కూడా ఒక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త ఒకవేళ నిజమే అయితే మాత్రం రాబోయే మరికొన్నేళ్లలో ఎన్టీఆర్, రాజమౌళి ల కాంబో మూవీ మిస్ అయినట్లే అని అంటున్నారు విశ్లేషకులు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: