శర్వానంద్ ఎవరిని పెళ్లి చేసుకుంటున్నాడంటే..!
శర్వానంద్ పెళ్లి గురించి టాలీవుడ్ లో ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. ఈ హీరో త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడనే మాటలు వినిపిస్తున్నాయి. 2020లోనే శర్వానంద్ కూడా మేరీడ్ లైఫ్ మొదలుపెట్టే అవకాశముందని సినీజనాలు గుసగుసలాడుకుంటున్నారు. శర్వా తన చైల్డ్ హుడ్ ఫ్రెండ్ తో కలిసి కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాడనే మాటలు వినిపిస్తున్నాయి.
2020లోనే టాలీవుడ్ లో చాలామంది హీరోలు ఒక ఇంటివారయ్యారు. నిఖిల్, నితిన్, రానా ఇలా బ్యాచిలర్ బాబులు మేరీడ్ మెన్ గా మారారు. కరోనా కాలంలోనే కొత్త లైఫ్ స్టార్ట్ చేశారు. ఇక మెగా డాటర్ నిహారిక కూడా ఈ ఏడాదే పెళ్లి చేసుకుంటోంది.హైదరాబాదీ టెకీ చైతన్యకు, నిహారికాకు రీసెంట్ గానే ఎంగేజ్ మెంట్ అయ్యింది. ఇప్పుడు వీళ్ల రూట్ లోనే శర్వానంద్ కూడా 2020లోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంలో వాస్తవం లేదని మీడియాకు క్లారిటీ ఇచ్చాడు శర్వానంద్.
శర్వానంద్ కి ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచనే లేదట. ప్రస్తుతానికి తాను సినిమాల గురించే ఆలోచిస్తున్నట్టు చెప్పాడు. ఇక ప్రొఫెషనల్ లైఫ్ ని ఇంకా డిజైన్ చేసుకోవాల్సి ఉందని క్లారిటీ ఇచ్చాడు శర్వా. ఆ తర్వాత పర్సనల్ లైఫ్ గురించి ఆలోచిస్తానని, ఇప్పటికైతే పెళ్లి గురించి ఆలోచించలేదని చెప్పాడు శర్వానంద్. శర్వానంద్ పక్కింటి అబ్బాయిలా కనిపిస్తాడు. లవ్ అండ్ ఫ్యామిలీ సెంటిమెంట్ మూవీస్ తో ప్రేక్షకుల నుంచి మెప్పుపొందాడు. కొత్త కొత్త కథాంశాలను ఎంచుకొని ఆయా పాత్రల్లో ఒదిగిపోయాడు.ఏ క్యారెక్టర్ ఇచ్చినా.. ఆ పాత్రకు న్యాయం చేస్తూ నేచురల్ స్టార్ అనిపించుకున్నాడు.