నన్ను బుక్ చేసుకోండి.. పోర్న్ స్టార్ బంపర్ ఆఫర్.. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే..?
ప్రస్తుతం భారత మాజీ పోర్న్ స్టార్ అయిన సన్నీలియోన్ సైతం ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేసింది. ప్రస్తుతం మరో శృంగార తార మియా కలీఫా కూడా అదే బాటలో నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో నన్ను బుక్ చేసుకోండి అంటూ ఆసక్తికర ప్రకటన చేసింది మియా ఖలీఫా. అయితే మియా కలీఫా తనను బుక్ చేసుకోవాలి అని చెప్పింది పాడు పని కోసం కాదు... ఓ మంచి పని కోసం.. ఇక పూర్తి స్టోరీ లోకి వెళితే.. లెబనాన్ లో చోటుచేసుకున్న భారీ పేలుడు వల్ల వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అంతే కాకుండా వేలాది మంది తీవ్రంగా గాయపడ్డారు,
బాధితులను ఆదుకోవడానికి ఎంతో మంది ముందుకు వచ్చి తమ పెద్దమనసు చాటుకున్నారు. ఈ క్రమంలోనే శృంగార తార మియా కలీఫా బాధితులను ఆదుకోవడానికి అభిమానుల ముందుకు రావాలంటూ పిలుపునిచ్చింది. తనకు ఇచ్చే ప్రతి పైసా కూడా రెడ్ క్రాస్ చేరేలా చేస్తాను అంటూ అభిమానులందరికీ భరోసా ఇచ్చింది మియా కలీఫా. ఒక వీడియో పోస్ట్ చేసిన మియా కలీఫా... మీ మాజీ ప్రేయసి పై మండిపడాలన్న.. మీ కజిన్ కి హ్యాపీ బర్త్ డే చెప్పాలన్న వెంటనే నన్ను బుక్ చేసుకోండి.. ఇదంతా తాను లెబనాన్ బాధితుల కోసం చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదండోయ్ తన వ్యక్తిగత వస్తువులను కూడా వేలం వేసి వచ్చిన డబ్బులను చారిటీకి అందించి పెద్దమనసు చాటుకుంది మియా ఖలీఫా.