ఇప్పుడు బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్ పరిస్థితి ఏంటో తెలుసా?

VAMSI
బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్ గుర్తున్నారా? మరి ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? హీరో సిద్ధార్థ్ పూర్తి పేరు సిద్ధార్థ్ సూర్యనారాయణ, సినిమాలలోనే కాదు, చదువులోనూ టాప్.మొదట డైరెక్షన్ డిపార్ట్మెంట్లో సెట్ అవ్వాలని ఇండస్ట్రీ కి వచ్చాడు...అసిస్టెంట్ డైరెక్టర్ గా  చేస్తుండగానే ఆయనకు శంకర్ దర్శకత్వంలో "బాయ్స్" సినిమా కు హీరో గా అవకాశం దక్కింది... దీంతో సిద్ధార్థ్ కెరియర్ యూటర్న్ తీసుకుంది..


" నువ్వొస్తానంటే నేనొద్దంటానా" సినిమా తో స్టార్ రేంజ్ కి ఎదిగాడు సిద్ధార్థ్.. బొమ్మరిల్లు తనకు బ్లాక్ బస్టర్ రేంజ్ ను తీసుకువచ్చింది..ఇక ఆ తరువాత హిట్స్ ఫ్లాప్స్ అని తేడా లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోయాడు. హీరో సిద్ధార్థ్ తెలుగు, తమిళ, హిందీ లో నటించి ఉత్తమ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.  హీరోగానే కాకుండా దర్శకుడిగా, సింగర్ గా , నిర్మాతగా సినీ ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా పేరు తెచ్చుకున్నాడు.  అయితే ఇంత క్రేజ్ తెచ్చుకున్న ఈ హీరో వరుస ఫ్లాపులతో ప్రేక్షకుల అభిమానానికి దూరం అయ్యాడు.



 2003లో పెళ్లి చేసుకుని సెటిల్ అయిన సిద్ధార్థ్ 2007 లో విడాకులు తీసుకున్నారని ప్రచారం జరిగింది..తన సహజ నటనతో ప్రేక్షకులను అలరించిన సిద్ధార్థ్ సడన్ గా సినిమాలలో డ్రాప్ అవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. తర్వాత తిరిగి మళ్లీ అదే జోష్ తో ఓ కొత్త సినిమాలతో వస్తారని ఆశించారు, కానీ అది ఇంత వరకు జరగలేదు. తర్వాత సిద్ధార్థ్ ప్లేస్లో అదే సహజ నటనతో వరుణ్ సందేశ్ మన ముందుకు వచ్చారు. వరుణ్ కూడా కొన్ని సినిమాలతోనే తెలుగు పరిశ్రమకు దూరం అయ్యారు. తెలుగు ఇండస్ట్రీ నుండి తమిళంలో   బాగా స్థిరపడి పోయాడు.



 "వదలడు" తమిళ రీమేక్ సినిమా హిట్ తర్వాత మరో సినిమా చేసినట్లు లేదు. మరి  హీరో తెలుగులో మళ్లీ వస్తారా? ఇప్పటికైతే తన కెరీర్ గురించి ఇంకా ఏమీ తెలియలేదు. ఇలా ఎంతో మంది యువ హీరోలు తమ కెరీర్ను సజావుగా ప్రారంభించినా, సరైన ప్లానింగ్ లేకుండా ఇలా మధ్యలోనే తమ కెరీర్ ముగింపు దశకి చేరిపోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: