నిర్మాతల మైండ్ బ్లాక్ చేస్తున్న సమంత..!
లాస్ట్ ఇయర్ మజిలీ, ఓ బేబీ సినిమాలతో హిట్ అందుకున్న సమంత ఈ ఇయర్ జాను అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం కథా చర్చల్లో పాల్గొంటున్న సమంత తన దగ్గరకు వచ్చిన దర్శక నిర్మాతలకు రెమ్యునరేషన్ షాక్ ఇస్తుంది. సమంత ప్రస్తుతం ఓ సినిమాకు మూడున్నర కోట్ల దాకా రెమ్యునరేషన్ అడుగుందట. పెళ్ళికి ముందు కూడా ఈ రేంజ్ డిమాండ్ చేయలేదు అమ్మడు.
సమంత ఉంటే సినిమాకు విపరీతమైన క్రేజ్ వస్తుంది. అంతేకాదు సమంత ఉంది అంటే దాదాపు సినిమా హిట్ అన్నట్టే లెక్క. సామ్ ఒక సినిమాలో నటిస్తుంది అంటే ఆ సినిమాలో కచ్చితంగా విషయం ఉంటుంది. ఇలా కాలిక్యులేటెడ్ గా ఆలోచిస్తే సమంత అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు కూడా వెనకాడరని చెప్పొచ్చు. మరి సమంత అడిగిన పారితోషికం ఇచ్చి ఆమెను సెలెక్ట్ చేస్తారా లేక లైట్ తీసుకుంటారా అన్నది చూడాలి. సమంత ఫాం చూస్తుంటే ఇప్పుడే కాదు మరో ఐదారేళ్ళు ఇదే హవా కొనసాగించేలా ఉంది. అక్కినేని కోడలిగా మారిన తర్వాత కూడా సామ్ తన సత్తా చాటుతూ అదరగొట్టేస్తుంది.