బిగ్ బాస్ స్టార్ పునర్నవి చేతికి ఈ బిగ్ ప్రాజెక్ట్ దక్కనుందా?

VAMSI
పునర్నవి భూపాలం మన విజయవాడ కు చెందిన తెలుగు అమ్మాయి.  ఈమె జర్నలిజం అండ్ సైకాలజీ పూర్తిచేసింది. పునర్నవి అంటే గత రెండు సంవత్సరాల క్రితం వరకు ఎవరికీ తెలియదనే చెప్పాలి. ఈమె సినిమాల మీద తనకున్నఆసక్తితో అవకాశాలకోసం  ఎన్నో ఆఫీసుల తలుపు తట్టింది, తనకున్న స్నేహితుల ద్వారా ప్రయత్నించింది. కానీ తనకు తొలి సినిమా 2013  లో "ఉయ్యాలా జంపాలా" అనే ఒక అందమైన సినిమాతో అవకాశం వచ్చింది. ఇందులో హీరోయిన్ FREIND సునీత అనే పాత్రలో నటించింది.  తర్వాత మరి కొన్ని చిత్రాలలో "మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు", "ఒక చిన్న విరామం", "ఈ సినిమా సూపర్ హిట్ గ్యారంటీ", "అమ్మకు ప్రేమతో నీ సాధిక" మరియు "మనసుకు నచ్చింది" వంటి పలు చిత్రాలలో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.


ఇలా తన జీవితం సాగుతూ ఉండగా ఒకసారి మా టీవీ యాజమాన్యం వారి దగ్గరనుండి ఫోన్ వచ్చింది, మీరు బిగ్ బాస్ సీజన్ 3 లో నటిస్తారా అని, అంతే ఇక అది మొదలు బిగ్ బాస్ షో లో రోజు రోజుకి పునర్నవి మాటలకు, తన ఆటిట్యూడ్ కు, హావభావాలకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. ఇదంతా ఒక ఎత్తయితే బిగ్ బాస్ లో ఈమెకు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు మద్యన జరిగిన ఒక అందమైన స్నేహమో, ప్రేమో లేక ఇంకేదో, ప్రేక్షకులకు చాలా బాగా కనెక్ట్ అయింది. అంతే ఇక పునర్నవి కోసం ప్రేక్షకలోకం తాను ఎలిమినేషన్ లో ఉన్న ప్రతిసారీ పోటీపడి మరీ ఓట్లు వేసి తనను సేవ్ చేసే వారు. బిగ్ బాస్ తర్వాత తనకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. పునర్నవి జీవితం యూ టర్న్ తీసుకునే రోజులు దగ్గరపడ్డాయి అనే వార్తలు సినీలోకంలో వైరల్ అవుతున్నాయి.


బిగ్ బాస్ తో పాపులర్  అయిన పునర్నవికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం దొరికిందని వార్త ఇప్పుడు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. పవర్ స్టార్ తో నటించడానికి ఎంతోమంది పెద్ద హీరోయిన్లు క్యూ కడుతుంటే పునర్నవి ఈ ఛాన్స్ కొట్టేసిందంటూ వార్తలొస్తున్నాయి. ఇదంతా బిగ్ బాస్ షో మరియు రాహుల్ సిప్లిగంజ్  పుణ్యమే అంటున్నారు ఈ వార్తలు విన్న ఆమె అభిమానులు. ఇంతకీ అ సినిమా మరేదో కాదు పవన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అయిన "విరూపాక్ష". పవన్ తరువాత చిత్రానికి ఈ టైటిల్ ను ఖరారు చేసారు. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జాక్వెలిన్ పెర్నాండెజ్ హీరోయిన్ కాగా మరొక కీలక పాత్రకోసం పునర్నవి అయితే సరిపోతుందని చిత్రబృందం భావిస్తున్నట్లు గాసిప్ హడావిడి చేస్తుంది. ఈ వార్తలో ఎంత మాత్రం నిజముందో తెలియాలంటే అధికారక వార్త కోసం వేచిచూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: