డబ్బే డబ్బు : ప్రవేట్ రైళ్ళ నిర్వాహణలో తెలుగు తేజం !
ఇండియా రైల్వే శాఖకు సంబంధించిన కేవలం 5 శాతం రూట్లను ప్రవీటీకరణ చేయడం ద్వారా త్వరలో ఈరంగంలో 30 వేలకోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. సికింద్రాబాద్ బెంగుళూరు చెన్నై ఢిల్లీ ముంబాయి పాట్నా హౌరా లకు సంబంధించిన అనేక ప్రముఖ పట్టణాల మధ్య ఈ ప్రవేట్ రైళ్ళు తిరగబోతున్నాయి. 2023 మార్చి నాటికి భారతదేశంలో ఈ ప్రవేట్ రైళ్ళు ప్రారంభం కాబోతున్నాయి.
ఈ కొత్త వ్యవస్థ ద్వారా అనేకమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. విమాన రంగంతో సమానంగా అత్యాధునిక సౌకర్యాలతో నడపబడే ఈ రైళ్ళు ద్వని రహితంగా ఉండబోతున్నాయి. 160 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసే ఈరైళ్ళలో ప్రయాణించే వారికి ఎటువంటి అలసట ఉండదు. ప్రస్తుతం బిడ్డింగ్ దశలో ఉన్న ఈపోటీలో తెలుగు పారిశ్రామిక వేత్తలు నిర్వహిస్తున్న జిఎమ్ఆర్ మేధా గ్రూపులకు ఈ బిడ్ వస్తే అనేకమంది తెలుగువారికి ఉద్యోగాలు వచ్చే ఆస్కారం ఉంది.
ప్రస్తుతం అన్ని రంగాలలోను ప్రవేటీకరణ జరుగుతున్న పరిస్థితులలో రానున్న రోజులలో మనదేశంలో ఈ ప్రవేట్ రైళ్ళ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 2027 నాటికి దేశంలో 151 ప్రవేట్ రైళ్ళు పరుగులు పెట్టబోతున్నాయి. ఇలా ప్రవేట్ రైళ్ళు రావడం వల్ల పోటీ పెరిగి సేవల నాణ్యత మెరుగుపడుతుందనే అంచనాలు వస్తున్నాయి. అయితే భారత ప్రభుత్వానికి అధిక ఆదాయాన్ని ఇస్తున్న రైల్వే సంస్థను ప్రవేట్ పరం చేయడం ఎంతవరకు సమంజసం అన్న విషయమై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ భారత ఆర్ధిక వ్యవస్థలో మరో పెనుమార్పుకు ఇది శ్రీకారం చుట్టబోతోంది..