కోన వెంకట్ తెలివైన ప్రశ్నపై ఆసక్తిక ర చర్చలు !

Seetha Sailaja
కరోనా సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్న పరిస్థితులలో వచ్చే నెలాఖరుకు మన దేశంలో కరోనా కేసుల సంఖ్య ఏస్థాయికి చేరుకుంటుంది అన్నఅంచనాలు కూడ ఎవరికీ అందడంలేదు. ఇలాంటి పరిస్థితులను లెక్కచేయకుండా వరసపెట్టి అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితులలో జనం విపరీతంగా బయటకు వస్తున్న పరిస్థితులలో కరోనాకు అడ్డుకట్ట ఇప్పట్లో పడకపోవచ్చు.


అయితే ఈపరిస్థితులు సద్దుమణిగే వరకు ధియేటర్లు తెరవకపోవచ్చు తెరిచినా జనం రారు. ఇలాంటి పరిస్థితులలో పెండింగులో ఉన్న షూటింగులు పూర్తి చేసి వాటిని రిలీజ్ చేయడమెలా అదేవిధంగా ప్రస్తుతం రిలీజ్ కు రెడీగా ఉన్న అనేక సినిమాలని ఎలా రిలీజ్ చేయాలి అనే విషయం పై టాలీవుడ్ పెద్దలకు పరిష్కారం దొరకడం లేదు.  



ఈసున్నితమైన సమస్యకు ఒక పరిష్కారం వెతికే ప్రయత్నం ఇప్పుడు కోన వెంకట్ చేస్తున్నాడు. ‘మీరు థియేటర్ల కోసం జనవరి లేదా ఫిబ్రవరి వరకు వేచి ఉండాల్సి వస్తే ‘నిశ్శబ్ధం’ చిత్రాన్ని ఏవేదికపై చూడాలనుకుంటున్నారు’ అంటూ ట్వీట్ లో సినిమా అభిమానులను కోన వెంకట్ ప్రశ్నించాడు.  ఈ ప్రశ్నను పరిశీలిస్తే ఇప్పటికే రిలీజ్ కు రెడీగా ఉన్న ‘నిశ్శబ్దం’ మూవీని ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయిన కోన వెంకట్ చాల వ్యూహాత్మకంగా ఇలాంటి ప్రశ్నను ప్రేక్షకుల ముందు ఉంచాడు అనుకోవాలి.


కోనవెంకట్ ప్రశ్నకు జనం నుండి అనూహ్య స్పందన వస్తే త్వరలోనే ‘నిశ్శబ్దం’ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై విడుదలయ్యే ఆస్కారం ఉంది. అదేజరిగితే జనం ఈపద్ధతికే ఓట్లు వేస్తున్నారు అంటూ ఇప్పటికే రిలీజ్ కు రెడీగా ఉన్న అనేక చిన్న మీడియం రేంజ్ సినిమాలు కోన వెంకట్ పద్ధతిని అనుసరించే ఆస్కారం ఉంది. ఒక అంచనా ప్రకారం ప్రస్తుతం విడుదలకు రెడీగా ఉండి మధ్యలో ఆగిపోయిన అనేక సినిమాల నిర్మాతలు ప్రస్తుతం ప్రతినెలా వందల కోట్లల్లో వడ్డీలు కడుతున్న పరిస్థితులలో కోనవెంకట్ ప్రశ్న ఈసమస్యకు పరిష్కారం చూపెడుతుందేమో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: