మాస్ మహారాజా ఇక మారడా.. ?

NAGARJUNA NAKKA
మాస్ మహారాజా రవితేజ వరుస ఫ్లాపులు ఎదురవుతున్నా తన రూట్ మార్చడం లేదు. ఒకే రూట్ లో వెళ్తున్నాడు. అపజయాలు స్వాగతం పలుకుతున్నా.. కెరీర్ నెమ్మదిస్తున్నా.. పాత పద్ధతినే ప్రియారిటీ ఇస్తున్నాడు వితేజ. మరి గ్రాఫ్ డౌన్ అయినా, మార్కెట్ తరుగుతున్నా రవితేజ ఎందుకు కొత్తగా ఆలోచించట్లేదనే ప్రశ్న ఆయన అభిమానుల్లో మెదులుతోంది. రొటీన్ వేలోనే ఆయన ఎందుకు వెళతున్నాడని తెగ ఆలోచిస్తున్నారు.

ఏ కథానాయకుడికి అయినా ఫ్లాపులు వెంటాడుతుంటే.. జానర్స్ మార్చాలని ప్రయత్నిస్తాడు. కానీ రవితేజ మాత్రం ఎన్ని ఫ్లాపులొచ్చినా మాస్ యాక్షన్స్ నే చాలా ఆశలు పెట్టుకుంటున్నాడు. కమర్షియల్ స్టోరీస్ తోనే ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. రెగ్యులర్ మాస్ మూవీస్ తో ఫ్లాపులొస్తున్నా.. ఇదే జానర్ లో వెళ్తున్నాడు రవితేజ. గోపీచంద్ మలినేనితో చేస్తోన్న ‘క్రాక్‘ రమేశ్ వర్మ దర్శకత్వంలో చేయబోయే ‘ఖిలాడీ’ రెండూ రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ తోనే తెరకెక్కుతున్నాయి.

రవితేజకు హిట్ పడి మూడేళ్లు అయింది. ‘రాజా ది గ్రేట్’ తర్వాత మాస్ మహారాజ్ నటించిన సినిమాలన్నీ ఫ్లాపుల్లోనే కలిశాయి. ‘టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు, అమర్ అక్బర్ ఆంటోని’ ఇలా అన్నీ ప్రేక్షకులను నిరాశపరిచాయి. రవితేజ మార్కెట్ ని దిగజార్చాయి. అయినా రవితేజ మాత్రం మాస్ మూవీస్ ని విడిచిపెట్టడం లేదు. కమర్షియల్ స్టోరీస్ కే సైన్ చేస్తున్నాడు. మరి రవితేజ ఎందుకీ జానర్ ని విడిచిపెట్టట్లేదనే సందేహాలు కలుగుతున్నాయి.

రవితేజ మాస్ మూవీస్ తోనే ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. కొంచెం వెటకారం, మరికొంచెం కామెడీ కలిసిన కథలతోనే మార్కెట్ పెంచుకున్నాడు. మాస్ మహారాజ్ అనే ఇమేజ్ తెచ్చుకున్నాడు. అందుకే ఎన్ని ఫ్లాపులొచ్చినా కమర్షియల్ ట్రాక్ నుంచి బయటపడలేకపోతున్నాడట. మరి ఇంతకుముందు స్టార్డమ్ తెచ్చిపెట్టిన ఈ మాస్ జానర్ తో రవితేజ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా అనేది చూడాలి. ఒక వేళ ఆయన పంథాను మార్చుకోగలిగితే విజయాలు ఆయన సొంతం కావొచ్చేమో..




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: