సుశాంత్ కేసులో మరో ట్విస్ట్.. దిశా శరీరం నగ్నం గా లేదు అంటున్న ముంబై పోలీసులు..?

praveen
టాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. మొదట ముంబై పోలీసులు ఈ కేసులో విచారణ జరిపి ఆ తర్వాత... సుశాంత్ సింగ్ ది  ఆత్మహత్య అని తేల్చారు. కానీ ఆ తర్వాత మాత్రం సుశాంత్ ది  ముమ్మాటికీ హత్యే అంటూ ఎన్నో ఆరోపణలు వచ్చాయి, ఇక సుశాంత్  తల్లిదండ్రులు తమ కొడుకు ఆత్మ హత్య కేసును సీబీఐకి అప్పగించాలి అంటూ బీహార్ ప్రభుత్వాన్ని కోరడం తో బీహార్ ప్రభుత్వం సుశాంత్ కేసును సీబీఐకి అప్పగిస్తు  నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే, సీబీఐ  ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు . విచారణలో సంచలన నిజాలు బయట పడుతూనే ఉన్నాయి. ఇప్పటికే సుశాంత్ డైరీ లో కీలక పేజీలు మిస్ అవడం... అంతేకాకుండా సుశాంత్ ఖాతా నుంచి ప్రియురాలు రియా చక్రవర్తి ఖాతాలోకి భారీగా డబ్బులు ట్రాన్స్ఫర్ కావడం... లాంటివి  బయటపడి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.



 అయితే ప్రస్తుతం సుశాంత్ మాజీ మేనేజర్ అయిన దిశా  ఎందుకు ఆత్మహత్య చేసుకుంది... ఆత్మహత్య చేసుకోవడానికి గల పరిణామాలు ఏంటి ఆ తర్వాత సుశాంత్ ఎందుకు డిప్రెషన్ కి  లోనయ్యారు.. అనే కోణాల్లో ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు జరుగుతోంది, అయితే సుశాంత్ మాజీ మేనేజర్ దిశ సలియాన్ పై అత్యాచారం చేసి ఆమెను చంపేశారని ఆమె మృతదేహం నగ్నం గా గుర్తించారు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ముంబై పోలీసులు స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అత్యాచారం చేసిన మృతదేహాన్ని నగ్నంగా గుర్తించాము అంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని అంటూ కొట్టిపారేశారు ముంబై పోలీసులు.



 దిశా సలియాన్  మృతదేహం లభ్యమైన సమయంలో ఆమె ఒంటిపై బట్టలు ఉన్నాయని.. ఆత్మహత్య జరిగిన వెంటనే స్నేహితులు ఆసుపత్రికి తీసుకు వచ్చారు అంటూ తెలిపారు, దిశ శరీరంపై గాయాల గుర్తులు ఏమైనా ఉన్నాయా అన్న విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాము  అంటూ తెలిపిన ముంబై పోలీసులు... దిశ మరణానికి ముందు రోజు జరిగిన పార్టీకి... ఆమె స్నేహితులు ప్రియుడు మాత్రమే హాజరయ్యారు అంటూ చెప్పుకొచ్చారు, సుశాంత్ మరణానికి సరిగ్గా అయిదు రోజుల ముందు... సుశాంత్ మాజీ మేనేజర్ దిశ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అటు వెంటనే సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడడం... సంచలనంగా  మారిపోయింది. ఇక ఈ కేసుపై సిబిఐ ముమ్మర దర్యాప్తు చేస్తుండగా సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: