పాప్ సింగర్స్ కు ఏమాత్రం తక్కువకాదు..!
కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉంటూ బోయ్ ఫ్రెండ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన శృతి హాసన్ అతని నుండి దూరమయ్యాక మళ్ళీ సినిమాలకు సైన్ చేస్తుంది. అంతేకాదు సినిమాలతో పాటుగా తనలో ఉన్న స్పెషల్ క్వాలిటీ అదే మ్యూజిక్ ఇంట్రెస్ట్ తో ఆల్బమ్స్ చేయాలని ఫిక్స్ అయ్యింది. ఎడ్జ్ అంటూ మొదటి సాంగ్ తో అమెరికన్ పాప్ సింగర్స్ కు ఏమాత్రం తీసిపోని విధంగా అమ్మడు తన సత్తా చాటుతుంది.
ఎడ్జ్ సాంగ్ లో శృతి హాసన్ అదర్గొట్టింది. ఏదైనా మనసుకి ఇష్టమైన పనిచేసేప్పుడు మన 100 పర్సెంట్ దృష్టి పెట్టేస్తాం అది ఎడ్జ్ సాంగ్ చూస్తే అర్ధమవుతుంది. సినిమాల్లో శృతి హాసన్ కేవలం ఒక పాత్రకు మాత్రమే పరిచయమైనా తను సొంతంగా క్రియేట్ చేసుకునే ఆల్బం లో సంగీతం.. సాహిత్యం.. గానం మూడింటిలో తనే స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. తప్పకుండా శృతి హాసన్ తీసుకున్న ఈ కొత్త స్టెప్ ఆమె క్రేజ్ ను డబుల్ చేస్తుందని చెప్పొచ్చు. ఇక సినిమాల విషయానికి వస్తే రవితేజ క్రాక్ తో పాటుగా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లో కూడా శృతి హాసన్ నటిస్తుంది.