చిరు - పవన్ కాదట ..... చిరు - చరణ్ కాంబో ఫిక్స్ అట .....??
టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి, గత ఏడాది సైరా నరసింహారెడ్డి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై ఎంతో భారీ ఖర్చుతో తెరకెక్కిన ఈ సినిమాలో తొలితరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ ఎంతో అత్యద్భుత నటనను కనబరిచారు. దాని తరువాత ప్రస్తుతం వరుస విజయాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఆయన చేస్తున్న సినిమా ఆచార్య. మంచి సోషల్ మెసేజ్ తో, పలు కమర్షియల్ హంగులను కలగలిపి, మెగాస్టార్ ఇమేజ్ కి తగ్గట్లుగా దర్శకడు కొరటాల ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ అతి త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమా తరువాత మెగాస్టార్ నటించబోయే సినిమాల గురించి కొద్దిరోజలుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. యువ దర్శకుడు సుజీత్ దర్సకత్వంలో తెరకెక్కబోయే మలయాళ మూవీ లూసిఫర్ రీమేక్ లో మెగాస్టార్ నటిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఇక కొన్నాళ్ల క్రితం, టాలీవుడ్ కళా బంధు సుబ్బరామిరెడ్డి నిర్మాణంలో తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి మెగాస్టార్ ఒక సినిమా చేయనున్నట్లు వార్త వచ్చిన విషయం తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు అప్పట్లో సుబ్బరామిరెడ్డి చెప్పారు. అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి, ఆ సినిమా లో మెగాస్టార్ తో కలిసి నటించేది మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అని అంటున్నారు.
ఇప్పటికే వకీల్ సాబ్, క్రిష్ దర్శకత్వంలో ఒక మూవీ తో పాటు, అతి త్వరలో హరీష్ శంకర్ దర్శకత్వంలో మరొక సినిమా చేయనున్న పవన్, ఆ తరువాత కొంత రాజకీయాల్లో బిజీ కానున్నారని, అందుకే ఆ సినిమాలో పవన్ బదులు రామ్ చరణ్ ని తీసుకుంటున్నట్లు చెప్తున్నారు. ఇప్పటికే ఆ సినిమా కోసం అద్భుతమైన స్టోరీ ని సిద్ధం చేసిన త్రివిక్రమ్, మరికొద్దిరోజుల్లో తండ్రి, తనయులు ఇద్దరికీ దానిని వినిపించనున్నారని టాక్. అన్నీ కలిసివస్తే వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉందట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియాలి అంటే ఈ సినిమా యూనిట్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే .....!!