మాజీ భార్య ఫోటోపై కామెంట్ చేసిన హృతిక్ రోషన్..!
హృతిక్ రోషన్ క్రిష్, ధూమ్ సినిమాల ద్వారా భారతీయ సినీ ప్రేక్షకులకు బాగా సుపరిచితుడు అయ్యారు. బాలీవుడ్ బాద్ షా అయిన షారుక్ ఖాన్ తర్వాత అత్యంత అందగాడిగా పేరొందారు హృతిక్ రోషన్. అయితే ఈ అందగాడిని సుస్సాన్ ఖాన్ అనే ఒక యువతి 2000 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరూ దాదాపు 14 సంవత్సరాల పాటు సంసారం చేశారు కానీ ఏవో కొన్ని మనస్పర్థల కారణంగా పరస్పర అంగీకారంతో 2013వ సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హృతిక్ రోషన్ ఎవరిని పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే తన జీవితాన్ని సాగిస్తున్నాడు.
అయితే వీరి పద్నాలుగేళ్ల వైవాహిక జీవితంలో ఇద్దరు పిల్లలు జన్మించారు. విడాకులు తీసుకున్నప్పటికీ సుస్సాన్ ఖాన్, హృతిక్ రోషన్ తమ పిల్లల కోసం మంచి స్నేహితులుగా ఉంటూ వారికి ఏ లోటు రాకుండా చూసుకుంటున్నారు. లాక్ డౌన్ సమయంలో సుస్సాన్ ఖాన్, హృతిక్ రోషన్ ఒకే ఇంట్లో ఉంటూ తమ పిల్లలను బాగా చేసుకున్నారట.
auto 12px; width: 50px;">View this post on InstagramChallenge accepted..♥️🎈🔧thank you @anaitashroffadajania @bipashabasu @farahkhanali @suchipillai 🎈🎈🎈🎈 #womeninspiringwomen #lovelaughliveandgive 😇♥️#bigheartstyle A post shared by Sussanne Khan (@suzkr) on
లాక్ డౌన్ ఎత్తి వేసిన అనంతరం సుస్సాన్ ఖాన్ తన ఇంటికి వెళ్ళిపోయింది. కాగా... సుస్సాన్ ఖాన్ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో పోస్ట్ చేసి చాలెంజ్ యాక్సప్టెడ్ అని ఒక క్యాప్షన్ జోడించింది.
అయితే ఆమె ఫోటో ని చూసిన హృతిక్ రోషన్ 'ఇంతకీ చాలెంజ్ ఏంటి?' అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా... 50 మంది మహిళలను ఎంపిక చేసుకొని ప్రైవేట్ మెసేజ్ పంపించి నువ్వు వాళ్ళని గౌరవిస్తున్నావని, అభిమానిస్తున్నావని ఆప్యాయత ప్రేమలతో చెబుతూ వారి వృత్తిని ప్రోత్సహిస్తూ వారిని ఆనంద పరచాలి', అని ఆమె చెప్పుకొచ్చారు. ఇకపోతే ఈ చాలెంజ్ లో పాల్గొనేవారు ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయాలి. సమంత అక్కినేని కూడా శిల్పా రెడ్డి, సబితా సుకుమార్ విసిరిన ఈ చాలెంజ్ ని టేకప్ చేసి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ లో ఈ చాలెంజ్ విపరీతంగా వైరల్ అవుతుంది.