ఒక్క మాటతో సమాధానం ఇచ్చిన చెర్రీ.. !

NAGARJUNA NAKKA

మెగా హీరోలు ముఖ్యంగా చిరంజీవి.. రామ్ చరణ్ సినిమాలపై ఈ మధ్య కాలంలో చాలా వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్ ఫలానా డైరెక్టర్ తో వర్క్ చేస్తున్నాడని.. చిరంజీవి నటించే రీమేక్ అటకెక్కిందని.. ఇలా వస్తున్న వార్తలు వినీవినీ.. చెర్రీ విసిగిపోయాడు. ఒక్క మాటతో సమాధానం ఇచ్చాడు. సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. 

 

చిరంజీవి ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో ఆచార్యలో నటిస్తున్నాడు. అలాగే.. సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో మలయాలం హిట్ లూసిఫర్ రీమేక్ లో నటించనున్నాడు. లాక్ డౌన్ టైమ్ లోకథలో మార్పులు చేర్పులు చేస్తున్నాడు దర్శకుడు. ఇక రామ్ చరణ్ అయితే.. ఆర్ఆర్ఆర్ తప్ప మరో సినిమాకు కమిట్ కాలేదు.అయితే వస్తున్న గాసిప్స్ కు ఫుల్ స్టాప్ పెడుతూ.. రంగ స్థలంలో స్టిల్ పోస్ట్ చేసి.. నమ్మశక్యమైన వార్తలనే విందామని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు చెర్రీ. ఈ లెక్కన వస్తున్న వార్తలన్నీ పుకార్లే అని తేలిపోయింది. 

 

ఆచార్య షూటింగ్ 40శాతం మాత్రమే పూర్తయింది. ఈ లోగా లూసిఫర్ తెలుగు రీమేక్ కు సుజిత్ మెరుగుదిద్దిస్తున్నాడు చిరంజీవి. సుజిత్ పై నమ్మకం లేక మెగా కాంపౌండ్ దర్శకుడిని బయటకు పంపించేసి.. ఠాగూర్.. ఖైదీ నెంబర్ 150 లాంటి రెండు హిట్స్ ఇచ్చిన v VINAYAK' target='_blank' title='వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">వినాయక్ ను తీసుకున్నారన్న వార్త హల్ చల్ చేసింది. 

 

ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటించే సినిమాలపై రోజుకో కథనం వెలువడుతోంది. తర్వాత మూవీ దర్శకుడిగా జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కన్ ఫార్మ్ అయ్యాడన్నది టాక్. లేటెస్ట్ న్యూస్ ప్రకారం.. భీష్మ ఫేమ్ వెంకీ కుడుముల కథ ఓకే అయిందట. తండ్రీ కొడుకులపై వస్తున్న వార్తలను రామ్ చరణ్ వ్యతిరేకించాడు. విశ్వసనీయమైన వార్తలనే నమ్ముదామని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. రీసెంట్ గా వస్తున్న న్యూస్ అంతా గాసిప్సేనని తేలిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: