ఇక్కడ తమన్నా.. అక్కడ కాజల్.. రచ్చ షురూ..!
బాలీవుడ్ లో సూపర్ హిట్టైన క్వీన్ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రీమేక్ చేశారు. తెలుగులో తమన్నా, తమిళంలో కాజల్ హీరోయిన్స్ గా నటించిన ఈ రీమేక్ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయినా సరే రిలీజ్ కు ఏవేవో అడ్డంకులు ఏర్పడ్డాయి. తెలుగులో తమన్నా నటించిన సినిమాకు దట్ ఈజ్ మహాలక్ష్మి అని టైటిల్ పెట్టగా.. కాజల్ నటించిన తమిళ సినిమాకు పారిస్ పారిస్ అని పెట్టారు. ఈ రెండు సినిమాలు రిలీజ్ కు నోచుకోలేదు. అయితే త్వరలో ఈ సినిమాలు ఓటిటి లో రిలీజ్ అవుతాయని తెలుస్తుంది.
తెలుగులో తమనా చేసిన దట్ ఈజ్ మహాలక్ష్మి సినిమాను అ! ఫేం ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేశారు. తెలుగు క్వీన్ కన్నా సరే తమిళ క్వీన్ అదేనండి పారిస్ పారిస్ కు బాగా క్రేజ్ వచ్చింది. ఎందుకంటే కాజల్ టీజర్ లో కొన్ని హాట్ సీన్స్ సినిమాపై ఆస్కతి పెరిగేలా చేశాయి. అయితే కొన్నాళ్ళ నుండి రిలీజ్ నోచుకోని ఈ సినిమా ఓటిటి రిలీజ్ కు మోక్షం కలిగిందని తెలుస్తుంది. తమిళంలో తెరకెక్కిన పారిస్ పారిస్ సినిమాను రమేష్ అరవింద్ డైరెక్ట్ చేశారు. తెలుగుతో పోల్చుకుంటే తమిళ సినిమా కొద్దిగా బూతు కంటెంట్ తో తెరకెక్కించారు.
అందుకే ముందు కాజల్ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారట. పారిస్ పరైస్ త్వరలోఏ ఓటిటిలో ప్రత్యక్షమవనుందట. తెలుగు క్వీన్ రిలీజ్ పై ఇంకా క్లారిటీ రాలేదు కాని తమిళ క్వీన్ రీమేక్ పారిస్ పారిస్ మాత్రం త్వరలోనే ఓటిటి రిలీజ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. మేకర్స్ కు ఓటిటి సంస్థకు డీల్ సెట్ అవడంతో సినిమా రిలీజ్ కన్ఫాం అయ్యింది. అయితే అది ఎప్పుడన్నది మాత్రం ఇంకా తెలియలేదు.