పెళ్ళైన మూడో రోజే ఇంట్లోంచి వచ్చేసా.. నా భర్తే కారణం.. అసలు నిజం చెప్పిన ప్రియమణి..?

praveen
దక్షిణాది చిత్ర పరిశ్రమలో హీరోయిన్ ప్రియమణి తెలియని సినీ ప్రేక్షకుడు అనడంలో అతిశయోక్తి లేదు. తెలుగు, తమిళ,  కన్నడ, మలయాళ చిత్రాల్లో ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది ప్రియమణి. ఇక అప్పట్లో  తెలుగులో టాప్ హీరోయిన్ గా హవా  నడిపించింది. ఎన్నో విభిన్నమైన పాత్రల్లో  తన వైవిధ్యమైన నటనతో అందరినీ మెప్పించి విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది ప్రియమణి. ఒకప్పుడు హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ప్రియమణి...పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ పెళ్లి తర్వాత కూడా తన జోరు ఎక్కడ తగ్గించలేదు ఈ భామ. పెళ్లి అయినప్పటికీ ఓవైపు బుల్లితెరపై అలరిస్తూనే మరోవైపు వెండితెరపై కూడా వరుస  సినిమా అవకాశాలు దక్కించుకుంటూ... ముఖ్యమైన పాత్రలు చేస్తూ దూసుకుపోతుంది.



 బుల్లితెరలో ఈటీవీ లో ప్రసారమయ్యే డాన్స్ రియాలిటీ షో ఢీ  లో జడ్జిగా బుల్లితెర ప్రేక్షకులందరికీ దగ్గరయింది ప్రియమణి. వెండితెరపై కూడా వరుస అవకాశాలు దక్కించుకుంటుంది. ప్రస్తుతం విరాటపర్వం,  నారప్ప సినిమాల్లో  ప్రియమణి కీలక  పాత్రలను పోషిస్తున్నారు. అయితే ఇదంతా తన భర్త వల్లే సాధ్యం అయింది అని చెబుతోంది ప్రియమణి. తన భర్త సహకారం లేకపోతే పెళ్లి తర్వాత సినిమాల్లో నటించే దానిని కాదు అంటుంది. హీరోయిన్ గా చిత్ర పరిశ్రమలో ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ పెళ్లి తర్వాత భర్త సహకారం అంగీకారం లేకపోతే మాత్రం సినిమాల్లో నటించడానికి కుదరదు అని చెప్పుకొచ్చిన ప్రియమణి..  ఆ విషయంలో మాత్రం తాను ఎంతగానో అదృష్టవంతురాలిని అంటూ తెలిపింది.


తన భర్త అర్థం చేసుకోవడం వల్ల పెళ్లయిన మూడో రోజునే  ఇంట్లో నుండి షూటింగ్ కోసం బయటకి వెళ్ళగలిగాను అంటూ చెప్పుకొచ్చింది ప్రియమణి. కొన్ని సార్లు తన సినిమా డేట్స్ విషయాన్ని కూడా తన భర్త స్వయంగా చూసుకుంటారు అంటూ  తన భర్త గురించి చెబుతూ ఎంతో మురిసిపోయింది  ప్రియమణి .Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: