మొన్న అబ్బాయితో .... ఈసారి ఏకంగా బాబాయ్ తో నటించనున్న రకుల్ .....??

GVK Writings

టాలీవుడ్ సినిమా పరిశ్రమకు కెరటం మూవీతో అడుగుపెట్టిన పంజాబీ భామ రకుల్ ప్రీత్ సింగ్, ఆ సినిమాలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తరువాత వేంకటాద్రి ఎక్స్ ప్రెస్, లౌక్యం వంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న రకుల్, అక్కడి నుండి వరుసగా అవకాశాలతో దూసుకుపోయింది. ఆమెకు తెలుగులో మంచి అవకాశాలు అయితే వచ్చాయి గాని, వాటి ద్వారా ఆమెకు కొంత మిశ్రమ ఫలితాలు మాత్రమే దక్కాయి. ఎన్టీఆర్ తో ఆమె నటించిన నాన్నకు ప్రేమతో, అల్లు అర్జున్ తో నటించిన సరైనోడు, నాగచైతన్యతో చేసిన రారండోయి వేడుకచూద్దాం సినిమాలు తప్ప మధ్యలో ఆమె నటించిన సినిమాల్లో చాలావరకు ఆశించిన రేంజ్ సక్సెస్ కాలేదు. 

 

ఇక ఇటీవల తెలుగులో పెద్దగా అవకాశాలు లేని రకుల్, ప్రస్తుతం కోలీవుడ్ లో కమల్ హాసన్, శంకర్ ల కలయికలో తెరక్కుతున్న ఇండియన్ 2తో పాటు, మరొక సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో రకుల్ మాట్లాడుతూ, తనకు కొద్దిరోజుల క్రితం రెండు టాలీవుడ్ మూవీ ఆఫర్స్ వచ్చాయని, ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా కొనసాగుతున్న ఈ లాక్ డౌన్ పరిస్థితులు పూర్తిగా ముగిసిన అనంతరం వాటి గురించి తానే అఫీషియల్ గా చెప్తానని అన్నారు. కాగా నేడు పలు ఫిలిం నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి, రకుల్ అతి త్వరలో నటసింహం బాలయ్య సరసన ఒక మూవీలో నటించనున్నారని అంటున్నారు. 

 

ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో ఒక మూవీ చేస్తోన్న బాలయ్య, దాని తరువాత బి. గోపాల్ దర్శకత్వంలో నటించనున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ఎంపికయిందని, రాబోయే మరికొద్దిరోజుల్లో ఆ సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియధు గాని, ఒకవేళ ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం, మొన్న అబ్బాయి ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో మూవీలో జోడి కట్టిన అలరించిన రకుల్, మరికొద్దిరోజుల్లో బాబాయి బాలయ్య తో జతకట్టి ఏ రేంజ్ లో అదరగొడుతుందో చూడాలి.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: