ఎన్టీఆర్ vs అల్లు అర్జున్ ..... బెస్ట్ డ్యాన్సర్ ఎవరంటే .....??

GVK Writings

టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మొదటి తరం సూపర్ స్టార్లైన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు వంటి అగ్ర నటులు హీరోలుగా కొనసాగుతున్న సమయంలో ఎక్కువగా కథ, కథనాలు, అందులోని పాత్రలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు, ప్రేక్షకులు కూడా వాటి పైనే దృష్టి పెట్టేవారు. అయితే రాను రాను కాలం మారుతున్నకొద్దీ ప్రేక్షకుల ఆలోచనలు, అభిరుచుల్లో కూడా మెల్లగా మార్పు రావడం మొదలైంది. ఆ తరువాత సినిమాల్లో ఎన్టీఆర్ దగ్గరి నుండి మిగతా స్టార్స్ అందరూ కూడా తమదైన ఆకట్టుకునే స్టైల్ లో డ్యాన్స్ లు ప్రదర్శించేవారు. అలానే వాటికి అప్పటి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించేది కూడా. వారి తరువాత వచ్చిన చిరంజీవి,  బాలకృష్ణ,నాగార్జున, వెంకటేష్ ల తరం మొదలైన తరువాత ప్రేక్షకుల్లో డ్యాన్స్ ల పై మరింత ఆసక్తి పెరిగింది. 

దానికి తగినట్లుగానే వారు కూడా తమ సినిమాల్లో మంచి డ్యాన్స్ మూమెంట్స్ ఉండేలా చూసుకునే వారు. అయితే వారందరిలోకి ఎక్కువగా మెగాస్టార్ డ్యాన్స్ లకే ప్రేక్షకుల నుండి భారీ స్థాయిలో స్పందన లభించేదనేది వాస్తవం. డ్యాన్స్ లో మంచి ఈజ్ కనబరిచే మెగాస్టార్, తన డ్యాన్సింగ్ స్టైల్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే వారు. ఇక వారి తరం తరువాత వచ్చిన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి వారు కూడా తమదైన స్టైల్ లో కొన్ని సినిమాల్లో డ్యాన్స్ లు చేసి ఫ్యాన్స్ ని అలరించగా, వారిని మించేలా ఆ తరువాత వచ్చిన జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి వారు, మరింత అద్భుతంగా డ్యాన్స్ లు చేస్తూ ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి పేరుతో కొనసాగుతున్నారు. అయితే ఒకింత ఎక్కువగా ఎన్టీఆర్, అల్లు అర్జున్ డ్యాన్స్ లకు మాత్రం, వారి వారి ఫ్యాన్స్ మధ్య విపరీతమైన పోటీ ఉంటోంది. 

 

కాగా వారిద్దరిలో ఎవరు బెస్ట్ డ్యాన్సర్ అంటూ కొందరు పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో చర్చించుకోవడం కూడా జరుగుతోంది. అయితే వారిద్దరిలో ఎవరు బెస్ట్ డ్యాన్సర్ అని చెప్పడం కొంత కష్టమైన పని అని, ఎందుకంటే కొన్ని సినిమాల్లో అల్లు అర్జున్ అద్భుతంగా డ్యాన్స్ అదరగొడితే, మరికొన్ని సినిమాల్లో ఎన్టీఆర్, తన డ్యాన్స్ మూమెంట్స్ తో అలరించడం జరుగుతోందని, ఒకరకంగా వారిద్దరూ కూడా టాలీవుడ్ లో బెస్ట్ డ్యాన్సర్లు అని చెప్పకతప్పదు అని అంటున్నారు సినీ విశ్లేషకులు...!! 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: