సుశాంత్ మరణంపై సంజన ఎందుకు మాట్లాడటం లేదు..?
బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆకాల మరణంపై నిరంతరం తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్న నటి కంగనా రనౌత్.. తాజాగా మరో అంశం లేవనెత్తింది. 'దిల్ బెచారా' హీరోయిన్ సంజనా సంఘీపై సుశాంత్ అత్యాచారం చేశాడన్న ఆరోపణలపై సదరు నటి స్పందించకపోవడంపై విచారం వ్యక్తం చేసింది. అతడితో తనకున్న రెండేళ్ల స్నేహాన్ని తెలియజేసేందుకు సంజన ఎందుకు ఆలోచిస్తోందని ప్రశ్నించింది.సుశాంత్ మృతిపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా ఇటీవలే సంజనను దాదాపు ఏడు గంటలపాటు ముంబయి పోలీసులు ప్రశ్నించారు.
సుశాంత్ మృతిపై న్యాయం జరిపించాలని డిమాండ్ చేస్తూ, క్యాబినెట్ మాజీ మంత్రి సుబ్రమణియన్ స్వామి తరపు న్యాయవాది ఇష్కరన్ సింగ్ భండారి.. 'క్యాండిల్ ఫర్ ఎస్ఎస్ఆర్' ఆన్లైన్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో సుశాంత్ మాజీ ప్రియురాలు అంకితా లోఖండే, కంగనా రనౌత్, శేఖర్ సుమన్ తదితరులు పాల్గొన్నారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు తన స్వస్థలం పూర్ణియా జిల్లా వాసులు గొప్ప నివాళి అర్పించారు. నగరంలోని చారిత్రాత్మక ఫోర్డ్ కంపెనీ జంక్షన్‌కు ఇతడి పేరు పెట్టారు. దీనితోపాటే మధుబని నుంచి మాతా ప్రాంతాన్ని అనుసంధానం చేసే దారిని ఇకపై సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మార్గం అని పిలవనున్నారు. ఈ మేరకు జిల్లా మేయర్ సవితా దేవి స్పష్టం చేశారు.
మున్సిపల్ కార్పోరేషన్లో వాయిస్ ఓటింగ్ పద్దతి ద్వారా ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చినట్లు మేయర్ తెలిపారు. అంతే కాకుండా, సుశాంత్ పూర్వీకుల గ్రామం ఈ పూర్ణియా అని.. హీరో మరణించిన తర్వాత అతడి కోసం ఓ స్థూపాన్ని కూడా నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేసినట్లు సవితా దేవి పేర్కొన్నారు. సుశాంత్ బాల్య స్నేహితుడు, బిహార్ వికాస్ మోర్చా అధ్యక్షుడు రాకేశ్ సింగ్ మట్లాడుతూ.. "ఇది సుశాంత్‌కు గొప్ప నివాళి మాత్రమే కాదని, రాష్ట్రానికే గర్వకారణం" అని వెల్లడించారు.