కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అని మీకు తెలుసా..!

Suma Kallamadi

బిగ్ బాస్ షో ద్వారా తెలుగు ప్రజలకు బాగా సుపరిచితమైన కత్తి మహేష్ తన జీవితంలో ఎన్నడూ లేని పాపులారిటీని సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు విచ్చేసిన అనంతరం కత్తి మహేష్ అందరినీ టార్గెట్ చేస్తూ ప్రజల దృష్టిలో చాలా రోజుల వరకు నిలిచాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం మొదలు పెట్టి వార్తల్లో బాగా నిలిచాడు కత్తి మహేష్. దీంతో అప్పట్లో ప్రతిరోజు కత్తి మహేష్ చుట్టూ అనేక వివాదాలు తిరిగేవి. ఈ విధంగా పవన్ కళ్యాణ్ కి శత్రువు గా మారిన కత్తి మహేష్ ఇప్పుడు ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అయ్యాడు. దీంతో సినీ అభిమానులంతా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. 


రామ్ గోపాల్ వర్మ పై ప్రతీకారం తీర్చుకునేందుకు పవర్ స్టార్ అభిమానులు ఫండింగ్ చేసి పరాన్న జీవి అనే సినిమాని రూపొందిస్తున్నారు. ఈ సినిమా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించే పవర్ స్టార్ సినిమా కి కౌంటర్ అని ఇప్పటికే చిత్రబృందం చెప్పుకొచ్చింది. పరాన్నజీవి చిత్రానికి సంబంధించిన ఒక ట్రైలర్ కూడా యూట్యూబ్ లో విడుదలై పెద్ద సంచలనమే రేపింది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత షకలక శంకర్ రామ్ గోపాల్ వర్మ పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది. 


అయితే పరాన్నజీవి సినిమా లో పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా కత్తి మహేష్ నటించబోతున్నాడట. తాజాగా పరాన్న జీవి మూవీ నుండి మహేష్ కత్తి ది  పికే ఫ్యాన్ అంటూ ఒక పోస్టర్ విడుదల అయింది. ఈ పోస్టర్ లో కత్తి మహేష్ జేబుపై పవన్ కళ్యాణ్ ఫోటో వేయించుకొని మరీ కనిపించాడు. రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న పవర్ స్టార్ సినిమా లో కూడా కత్తి మహేష్ ఓ జర్నలిస్టు పాత్రలో నటిస్తున్నాడు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా కత్తి మహేష్ కనిపించడం ఆశ్చర్యకరమైన విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: