అల్లు అర్జున్ 'కారణజన్ముడు'.. కొరటాల శివ సినిమా టైటిల్ ఫిక్స్..!
అల వైకుంఠపురములో సూపర్ డూపర్ హిట్ అవడంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫుల్ జోస్జ్ లో ఉన్నాడు. ఎంతో కష్టపడి తీసిన నా పేరు సూర్య నిరాశపరచడంతో కొద్దిపాటి గ్యాప్ తీసుకుని సింపుల్ కథ, కథాలతో త్రివిక్రం సెల్యులాయిడ్ నుండి వచ్చిన అల వైకుంఠపురములో ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. ఎంతలా అంటే ఏకంగా నాన్ బాహుబలి రికార్డులను తన పేరు మీద రాసుకునేలా అన్నమాట. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ కూడా హైలెట్ గా నిలిచింది. పూజా హెగ్దె అందాలు సినిమాకు ప్లస్ అయ్యాయి.
ఈ సినిమా తర్వాత సుకుమార్ డైరక్షన్ లో పుష్ప సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో మాస్ లుక్ తో కనిపించనున్నాడు అల్లు అర్జున్. ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నడు అల్లు అర్జున్. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్న కొరటాల శివ నెక్స్ట్ సినిమా అల్లు అర్జున్ తోనే అని తెలుస్తుంది. మిర్చి నుండి రాబోయే ఆచార్య వరకు సోషల్ మెసేజ్ కథలనే కమర్షియల్ సినిమాలుగా మలిచి హిట్ కొడుతున్న కొరటాల శివ అల్లు అర్జున్ సినిమాను కూడా అలాంటి కథతోనే వస్తున్నాడట.
ఈ సినిమాకు టైటిల్ గా కారణజన్ముడు అని పెట్టబోతున్నారని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మిస్తారట. ఆల్రెడీ పుష్ప సినిమా ఈ బ్యానర్ లోనే తెరకెక్కుతుంది. అల్లు అర్జున్ మైత్రి కాంబో సెన్సేషనల్ కానుంది. పుష్ప సినిమా నేషనల్ వైడ్ గా రిలీజ్ ప్లాన్ చేశారు. కెరియర్ లో మొదటిసారి బన్నీ తన సినిమాను ఐదు భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.