పవన్ హీరోయిన్ దేవయాని ప్రేమ వివాహం ఎలా జరిగిందో తెలుసా...?

Suma Kallamadi

సుస్వాగతం సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించిన దేవయాని తన చీర కట్టు అందాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈమె నాని సినిమాలో మహేష్ బాబు తల్లిగా కూడా నటించింది. కొన్నాళ్ల క్రితం విడుదలైన జనతా గ్యారేజ్ సినిమాలో కూడా దేవయాని ఒక పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. 2002వ సంవత్సరంలో చెన్నకేశవరెడ్డి సినిమా లో బాలకృష్ణ చెల్లెలి పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించింది. మహారాష్ట్రలోని ముంబై నగరంలో జన్మించిన దేవయాని మొట్టమొదటిగా ఒక హిందీ సినిమాలో నటించి ఆ తర్వాత తమిళం, మలయాళం భాష చిత్రాల్లో నటించి అగ్రతారగా ఎదిగింది. 

సూర్యవంశం, భారతీ, కాదల్ కొట్టై సినిమాలో నటించినందుకు గాను ఆమెకు తమిళనాడు రాష్ట్ర ఉత్తమ నటి అవార్డులు మూడు లభించాయి. కమలహాసన్, అజిత్, విజయ్ వంటి బడా తమిళ హీరోలతో నటించిన దేవయాని 35 సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించింది. ఒక తమిళ టీవీ ధారావాహిక లో కూడా ఆమె నటించి బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. అయితే సినీ పరిశ్రమలో రాణిస్తున్న సమయంలోనే ఆమె సూర్యవంశం సినిమా కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన  రాజకుమారన్ తో ప్రేమాయణం నడిపింది. కానీ వీళ్ళిద్దరి తల్లిదండ్రులు వీరి ప్రేమ పెళ్లి కి అంగీకరించలేదు. 


దీంతో ఇద్దరూ కలిసి ఇంటి నుంచి వెళ్ళిపోయి ఏప్రిల్ 9, 2001 వ సంవత్సరం లో పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరి వివాహ జీవితంలో ఇద్దరు పండంటి బిడ్డలు జన్మించారు. ఐతే 2014వ సంవత్సరంలో ఆమె కొన్ని రోజుల పాటు చెన్నై నగరంలోని చర్చి పార్క్ స్కూల్ లో నాలుగవ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించింది. ఆ తర్వాత మళ్ళీ సినీ పరిశ్రమలో అరంగేట్రం చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ప్రేక్షకులను బాగా అలరిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: