వాళ్లను కొట్టడానికే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న పవన్ కళ్యాణ్..!

Suma Kallamadi

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  మార్షల్ ఆర్ట్స్ అయిన కరాటే లో బ్లాక్ బెల్ట్ సాధించాడు అన్న సంగతి తెలిసిందే. అతడు తన తొలి సినిమాల్లో ఎక్కువగా ఫైట్లు చేస్తుండేవాడు. అలాగే ప్రమాదకరమైన స్టంట్స్ నిజంగానే చేసేవాడు. ఒంటి మీద పెద్ద రాళ్ల బండలు పగలగొట్టుకోట్టించుకోవడం, కారు టైర్ కింద చేతులు పెట్టడం వంటి సాహసాలు చేసేవాడు. అయితే పవన్ కళ్యాణ్ కి చిన్నతనంలో మార్షల్ ఆర్ట్స్ పైన చాలా చులకన భావం ఉండేది. అప్పట్లో తన అన్నయ్య నాగబాబు మార్షల్ ఆర్ట్స్ చాలా పట్టుదలతో నేర్చుకునేవాడు. అలాగే పవన్ కళ్యాణ్ ని కూడా నేర్చుకోమని చెప్పేవాడు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం నాకు అవసరం లేదని చెప్పే వాడు. 


కానీ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత చిరంజీవి సినిమాల గురించి అతని ముందే ఎంతోమంది చులకనగా మాట్లాడుతూ అతడిని అవమానించేవారు. ఇవన్నీ వింటుంటే పవన్ కళ్యాణ్ కి బాగా కోపం వచ్చేది కానీ శారీరకంగా బలంగా లేనని తెలుసుకుని అతను వారితో గొడవ పెట్టుకోకుండా వెనకడుగు వేసేవాడు. ఇలాంటి చేదు అనుభవమే బెంగళూరులో కూడా ఎదురయ్యింది. ఆ సమయంలోనే అతను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఇక వాళ్లని అందరిని కొట్టాలనే కసితో పవన్ కళ్యాణ్ కష్టపడి కరాటే నేర్చుకున్నాడు. 


అతను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే సరికి ఏ ఒక్కరూ కూడా అతని జోలికి రాలేదు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నది కేవలం చెడ్డవారిని కొట్టడానికి ఉపయోగించే ఒక విద్య అని, తనని తాను రక్షించుకోవడానికి కరాటే నేర్చుకున్నానని పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నప్పటికీ పూర్తి మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఒక సినిమాని తెరకెక్కించే సాహసం తాను చేయలేనని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ జానీ సినిమాలో మార్షల్ ఆర్ట్స్ కోచ్ గా నటించిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: