లూసిఫర్ కు గ్రహణం గా మారిన ప్రముఖ దర్శకుడు ?
‘సాహౌ’ ఘోర పారాజయం తరువాత సుజిత్ కెరియర్ కు మళ్ళీ బ్రేక్ రావడం కష్టం అని భావిస్తున్న సమయంలో ఈయంగ్ డైరెక్టర్ కు ఊహించని అదృష్టంగా చిరంజీవి నుండి పిలు వచ్చింది. చిరంజీవి సూచనలతో సుజిత్ గత మూడు నాలుగు నెలలుగా ఈమూవీ తెలుగు రీమేక్ కు సంబంధించి అనేక మార్పులు చేర్పులు చేసాడు. అయితే ఇప్పుడు సుజిత్ పడిన కష్టం అంతా వృథా అవుతుందా అన్న సంకేతాలు వస్తున్నాయి. దీనికికారణం ఈసినిమాకు సంబంధించి సుజిత్ చేసిన మార్పులు చేర్పులు చిరంజీవికి నచ్చకపోవడం అన్నప్రచారం సాగుతోంది.
వాస్తవానికి ‘లూసిఫర్’ ను రీమేక్ చేయాలన్న బలమైన సంకల్పం మెగాస్టార్ చిరంజీవిది. కానీ అదే టైమ్ లో ఆ సినిమాను పక్కన పెట్టించి డైరక్టర్ బాబీ మైత్రీ మూవీస్ సినిమాను ముందుకు తీసుకురావాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రస్తుతం ఇండస్ట్రీలో గట్టిగా గాసిప్పులు వినిపిస్తున్నాయి. హడావిడి చేస్తున్న ఈ గాసిప్పుల ప్రకారం చిరంజీవి దృష్టి ‘లూసిఫర్’ నుండి తప్పించి దర్శకుడు బాబీ ఇప్పటికే చిరంజీవి కోసం తయారుచేసిన ఒక స్క్రిప్ట్ పై మళ్లేలా ఇండస్ట్రీలోని ఒక టాప్ డైరెక్టర్ గట్టి ప్రయత్నాలు చేతున్నట్లు టాక్.
ఇందులో భాగంగానే ‘లూసిఫర్’ వర్కవుట్ కాదని స్క్రిప్ట్ సెట్ చేయడం కష్టమని ఆ డైరక్టర్ మెగా స్టార్ కు మైండ్ వాష్ చేస్తున్నట్లు గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. సినిమాలు సెట్ చేసి లాభాల్లో వాటా అందుకోవడం అనే కొత్త కాన్సెప్ట్ ను సొంతం చేసుకుని ఆవిధంగా డబ్బులు సంపాదించే పనిలో బిజీగా ఉన్న ఆ డైరెక్టర్ ఒక టాప్ హీరోతో సినిమా సెట్ చేసి అలా సెట్ చేసిన మూవీ ప్రాజెక్ట్ కు వచ్చే లాభాలలో వాటా పొందడం ప్రస్తుతం ఇతడికి అలవాటుగా మారింది అని అంటున్నారు.
ఈ ప్రయత్నాలు సుజిత్ దృష్టి వరకు రావడంతో ఈ యంగ్ డైరెక్టర్ ఫీల్ అవుతున్నట్లు టాక్. అయితే మెగా కాంపౌండ్ సన్నిహితులు మాత్రం చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న ‘ఆచార్య’ మినహా తాను చేయాలనుకున్న అన్ని ప్రాజెక్టులు అన్ని ఇప్పటికి పెండింగ్ లో ఉన్నాయని ఒకరి మాటలకు ప్రభావితం అయ్యే వ్యక్తిత్యం చిరంజీవిది కాదు అని అంటున్నారు..