వాళ్ళ పక్కలోకి వెళ్లకపోతే సినిమానుండి తప్పిస్తారు.. రిచా చద్దా సంచలన కామెంట్స్..!
సుశాంత్ మరణం తరువాత సినిమా ఇండస్ట్రీలో బంధు ప్రీతి (నెపోటిజం) పదం బాగా వినిపిస్తోంది. ఇదే సందు అనుకొని, కొంతమంది హీరోయిన్స్ తమకు ఎదురైన చెడు అనుభవాలను పబ్లిక్ గా ప్రకటిస్తున్నారు. అలాగే కొంతమంది హీరోలు కూడా నెపోటిజం గురించి మాట్లాడటం మనం గమనించవచ్చు. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా బాలీవుడ్‌ని టార్గెట్ చేసుకొని ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు.
బాలీవుడ్ చీకటి కోణాలు గురించి, రిచా భారీస్థాయిలో స్పందిస్తున్నారు నటీ నటులు. తాజాగా సుశాంత్ స్నేహితురాలు, బాలీవుడ్ నటి రిచా చద్దా నెపోటిజం (బంధు ప్రీతి), బాలీవుడ్ ఇండస్ట్రీ చీకటి కోణాలు (కమిట్ మెంట్స్) గురించి మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేసింది. సుశాంత్‌తో తనకు వున్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ... రిచా చద్దా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.
ఈ సందర్భంగా ఆమె... "బాలీవుడ్‌లో రెండు రకాలైన మనుషులు మాత్రమే ఉన్నారని, ఒకరు జాలి ఉన్నవారైతే.. మిగిలినవారు జాలి లేనివారు." అని పేర్కొంది. స్టార్ కుటుంబం నుండి వచ్చినవారు కొంతమంది మంచివారైతే, మిగిలినవారు కనీసం జాలి, కరుణ లేని మూర్ఖులుగా వ్యవహరిస్తారని మండిపడింది. ఇందులో మొదటివారు హీరోయిన్లను చాలా హేళనగా చూస్తారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక సుశాంత్ మరణం తర్వాత నీతి కబుర్లు చెబుతూ, సంతాపం తెలిపిన దర్శక నిర్మాతల్లో కొందరు నీచాతి నీచమైన వ్యక్తులున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
కొంతమంది దర్శకులు, నిర్మాతలైతే ఆఫర్ ఇచ్చాక కూడా తమ పక్కలోకి రాలేదనే కసితో వివిధ సినిమాల నుంచి తొలగించిన దాఖలాలు లేకపోలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది రిచా. సుశాంత్‌తో తన మెమరీస్ ని నెమరువేసుకున్న రిచా.. కెరీర్ ప్రారంభానికి ముందు ఇద్దరూ కలిసి ముంబైలో థియేటర్ వర్క్‌షాప్స్‌కి, బైక్ పై వెళ్లే రోజులు గుర్తు చేసుకొని తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యింది.