రెడ్ డ్రెస్‌లో కేకపెట్టిస్తున్న యాంకర్ అనసూయ!!
యాంకర్ అనసూయ.. తెలుగువారికి పరిచయం అవసరం లేని పేరు. ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఈ అమ్మడు ఫుల్ పాపులర్ అయిపోయింది. ఈ క్రమంలోనే స్టార్ యాంకర్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. అయితే కేవలం బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా అనసూయ అలరించింది.
క్షణం, సోగ్గాడే చిన్నినాయనా వంటి సినిమాల్లో గుర్తింపు తెచ్చికున్న ఈ బ్యూటి.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్రలో నటించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
ఈ చిత్రం తర్వాత అనసూయకు క్రేజ్ కూడా భారీగా పెరిగిపోయింది. అలాగే అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్లు చేస్తూ కేకపెట్టిస్తుంటుంది. ఇక తాజాగా అనసూయ రెడ్ డ్రెస్‌లో ఉన్న ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.