కరోనా టైమ్స్ లో నితిన్ కు ముప్పేట కస్టాలు !
యంగ్ హీరో నితిన్ తాను ఎంతగానో ప్రేమించిన షాలినీ రెడ్డిని పెళ్ళి చేసుకోకుండా కరోనా సమస్యల వల్ల తన పెళ్ళిని వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. ఇది అతడి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన షాక్ అయితే ప్రస్తుత కరోనా పరిస్థితులు వల్ల టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఏ యంగ్ హీరోకు రాని కష్టాలు నితిన్ కు వచ్చాయి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
వరసగా మూడు ఫ్లాప్ లు రావడంతో ఎలర్ట్ అయిన నితిన్ గత సంవత్సరం తన సినిమాలకు సంబంధించిన వేగాన్ని పెంచి ఏ యంగ్ హీరో చేయనివిధంగా ఒకేసారి నాలుగు సినిమాలను లైన్ లో పెట్టాడు. ఆ లిస్టులో మొదటిదైన ‘భీష్మ’ విడుదలై మంచి సక్సస్ ను కూడ అందుకుంది. ప్రస్తుతం నితిన్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్న ‘రంగ్ దే’ మూవీ పరిస్థితులు సజావుగా ఉండి ఉంటే గత నెలలో విడుదలై ఉండేది.
ఈ సినిమాతో పాటు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఒక సినిమాను చేయడానికి నితిన్ ఆ నిర్మాతల దగ్గర అడ్వాన్స్ కూడ తీసుకున్నాడు. ఈ సినిమాలతో పాటుగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘అందధున్’ బాలీవుడ్ రీమేక్ కు లైన్ క్లియర్ చేయడమే కాకుండా కృష్ణ చైతన్య దర్శకత్వంలో ‘పవర్ పేట’ మూవీ స్క్రిప్ట్ కూడ పూర్తి అయింది.
ఈ కరోనా వైరస్ సమస్యలు లేకుండా ఉంది ఉంటే ఈ సంవత్సరంలో ఒక్కరోజు కూడ ఖాళీ లేకుండా నితిన్ తన డేట్స్ ను ఈ నాలుగు సినిమాలకు సద్దుబాటు చేయాలని భావించాడు. అయితే ఇప్పుడు షూటింగ్ లు ఆగిపోవడంతో పాటు హీరోలు అంతా తమ సినిమాలకు సంబంధించిన పారితోషికాలను తగ్గించుకోవలసిన పరిస్థితులలో ఏకంగా నితిన్ ప్రస్తుతం తాను నటిస్తున్న ఈ నాలుగు సినిమాలకు సంబంధించి తనకు రావలసిన పారితోషికాన్ని సగానికి సగం తగ్గించుకుంటే ప్రస్తుతం అందరి యంగ్ హీరోలకంటే ఎక్కువగా నష్టపోతున్నది నితిన్ మాత్రమే అంటూ అటు పెళ్ళి లోను ఇటు కెరియర్ లోను నితిన్ కు ఈ సంవత్సరం మరిచిపోలేని బ్యాడ్ ఇయర్ అంటూ నితిన్ సన్నిహితులు అతడి పై సానుభూతి చూపెడుతున్నారు..