రకుల్‌ను ఇలా ఎప్పుడైనా చూశారా!!

Kavya Nekkanti

రకుల్ ప్రీత్ సింగ్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `కేరటం` సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టిన ర‌కుల్‌.. ఆ త‌ర్వాత వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రంతో `ప్రార్ధనా`గా ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను గెలుచుకుంది.

లౌక్యం, కరెంట్ తీగ, పండగ చేస్కో, కిక్ 2, బ్రూస్ లీ, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ ఇలా వ‌రుస పెట్టి సినిమాలు చేస్తూ..  ‌అతి త‌క్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అయితే తెలుగులో ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు జోరు కాస్త త‌గ్గింద‌నే చెప్పాలి.

అయితే సినిమాల ప‌రంగా ఎలా ఉన్నా.. ర‌కుల్ సోష‌ల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ ఉంటుంది. ఈ నేప‌థ్యంలోనే ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫోటోలు పెడుతూ.. అభిమానులను ఎప్ప‌టిక‌ప్పుడు అల‌రిస్తుంటుంది. తాజాగా కూడా ర‌కుల్ లెటెస్ట్ ఫోటోలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: