బాలకృష్ణ, బోయపాటి కాంబోలో.. హీరోయిన్ గా ముంబై మోడల్!

Edari Rama Krishna

దేశంలో ఇప్పుడు కరోనా వైరస్ వల్ల ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారో అందరికీ తెలిసిందే. మార్చి నెల నుంచి లాక్ డౌన్ ప్రకటించింది కేంద్రం  అప్పటి నుంచి  షూటింగ్స్ పూర్తిగా బంద్ చేశారు.  దాంతో దేశ వ్యాప్తంగా సినీ పరిశ్రమ షట్ డౌన్ అయ్యింది. దాంతో చాలా వరకు స్టార్ హీరోల సినిమాలు వాయిదా పడ్డాయి. రిలీజ్ కాబోయే సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. ఇక బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న మూవీ షూటింగ్ షరవేగంగా జరుపుకుంటున్న సమయంలో కరోనా ప్రభావం పడింది. బాలకృష్ణ సినిమా అనగానే హీరోయిన్ల సందడి కూడా బాగానే వుంటుంది. ఎందుకంటే, ఆయన సినిమాల్లో గ్లామర్ కి, పాటలకు కూడా ఎక్కువ స్కోప్ వుంటుంది. సీనియర్ హీరోయిన్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. చాలా వరకు బాలీవుడ్ బ్యూటీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

 

ఈ నేపథ్యంలో సింహా, లెజెండ్ లాంటి సినిమాల్లో సైతం బాలీవుడ్ బ్యూటీలే నటించారు. తాజాగా బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న తాజా మూడో చిత్రానికి సంబంధించి ఇంతవరకు హీరోయిన్ ఎంపిక పూర్తికాలేదు. ఇంతకుముందు కొందరి పేర్లు వినిపించినా అవన్నీ ఒట్టిదేనని దర్శకుడు బోయపాటి కొట్టిపారేశారు. పైపెచ్చు ఇందులో కొత్త హీరోయిన్ ని పరిచయం చేస్తామంటూ ఆయన ప్రకటించారు కూడా.  

 

ఈ నేపథ్యంలో ప్రస్తుతం హీరోయిన్ ఎంపిక జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఒక అందమైన మోడల్ ని బాలకృష్ణ సరసన హీరోయిన్ గా పరిచయం చేయాలని భావిస్తున్నారట. ఈ సారి కూడా బాలీవుడ్ నుంచే కొత్త భామను తీసుకు వచ్చే యోచన చేస్తున్నారట. ప్రస్తుతం ముంబై మోడళ్లను సంప్రదిస్తున్నట్టు, త్వరలోనే ఒక అమ్మాయిని ఫైనల్ చేయనున్నట్టు తాజా సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడుతుంది. ఇక తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ చిత్రానికి 'మోనార్క్' అనే టైటిల్ని పరిశీలిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: