చిన్న పిల్లలను ముద్దు చేస్తూ పెద్ద అయ్యాక ఏమి చేస్తావు అని అడిగితే వాళ్ళు రకరకాలుగా తమ ఉద్దేశ్యాలను ముద్దు ముద్దుగా చెబుతూ ఉంటారు. అయితే బ్రిజిల్ దేశానికి చెందిన ఐదేళ్ళ డ్యూడా మటుకు ఏకంగా ఐదేళ్ళ వయస్సులోనే ఫ్యాషన్ డిజైనర్ గా మారిపోయి ఆ దేశంలోని ప్రముఖ చిన్న పిల్లల దుస్తుల కంపెనీకి ఫ్యాషన్ డిజైనర్ గా మారడం సంచలనమే.
అదే దేశానికి చెందిన సూపర్ మోడల్ జిసెల్ బున్ షెన్ మేనకోడలు డ్యూడా ఈ చిన్నమ్మాయి తన చిన్న తనం నుండి తన అత్త వెంట ఫ్యాషన్ షోలకి వెళ్ళేది. ఆ అమ్మాయి కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తులతో ఆ చిన్నారి అత్త జిసేల్ తీసుకు వెళుతూ ఉండటంతో అందంగా కనిపిస్తున్న ఆ అమ్మాయి ఫోటోలను ఆ దేశ మీడియా వాళ్ళు తెగ తీసేవారట.
ఆ అందమైన ఆ ఫోటోలు కొన్ని చిన్న పిల్లలల దుస్తుల కంపెనీ దృష్టిలో పడటంతో కేవలం మూడేళ్ళ వయస్సులోనే ఈ అమ్మాయిని కొన్ని కంపెనీలు తమ కిడ్స్ ఫ్యాషన్ షోకు ఎంపిక చేయడమే కాకుండా మరి కొన్ని కంపెనీలు ఈ అమ్మాయికి భారీ మొత్తాలు ఇచ్చి తమ చిన్న పిల్లల దుస్తుల కంపెనీకి బ్రాండ్ ఎంబాసిడర్ గా పెట్టుకున్నాయట. అంతేకాదు మరి కొన్ని కంపెనీలు తాము తయారుచేస్తున్న చిన్న పిల్లల దుస్తుల డిజైనింగ్ లో డ్యూడా సలహాలు తీసుకోవడం కూడ మొదలు పెట్టాయాట.
ఈ చిన్నారి తనకు వచ్చీరాని మాటలతో ఎలాంటి మోడల్ డ్రస్సులు వేసుకోవాలో ఆ మోడల్స్ లో ఎవరికి ఎలాంటి అందాన్ని ఇస్తాయో డ్యూడా ముద్దుముద్దుగా చెబుతూ ఉంటే పెద్దపెద్ద పిల్లల దుస్తుల కంపెనీ వాళ్ళు కూడా ఆశ్చర్య పోతున్నారట. అందుకునే అంటారు పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని...
మరింత సమాచారం తెలుసుకోండి: