కల్పనను నమ్ముకున్న వాళ్లు కష్టాలపాలవ్వరు..!
స్టార్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు పెద్దగా గుర్తింపు ఉండదు. కొన్ని సినిమాలైతే హీరోయిన్స్ కేవలం పాటలకే పరిమితం అవుతారు. కాని కొందరు హీరోయిన్స్ పాత్రలు మాత్రం సినిమాతో పాటే హీరోలకు సమానంగా ఉంటాయి. అయితే హీరోయిన్స్ పాత్రలు ఈక్వల్ గా లేకున్నా వారు చెప్పే డైలాగ్స్ మాత్రం సినిమాకు ఫేవరేట్ గా నిలుస్తాయి. అలా స్టార్ సినిమాలో ఫేవరేట్ గా నిలిచిన డైలాగ్స్ గురించి మాట్లాడుకుంటే కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ గజిని సినిమాలో సూర్య సరసన నటించిన ఆసిన్ పాత్ర ఆమె చెప్పే డైలాగ్స్ గుర్తుకు రాక మానదు.
తన లవర్ ఓ సెల్ ఫోన్ కంపెనీ ఓనర్ అని చెప్పి బిల్డప్ ఇచ్చే పాత్రలో ఆసిన్.. అసలు ఆమె ఎవరు తన పేరుని ఎందుకు వాడుకుంటుంది అని అడగడానికి వచ్చి ఆమె ప్రేమలో పడే హీరో.. మురుగదాస్ డైరక్షన్ లో సూర్య హీరోగా వచ్చిన గజిని సినిమాలో హీరోయిన్ ఆసిన్ చెప్పే ఓ ఫేమస్ డైలాగ్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. కల్పనని నమ్ముకున్న వాళ్లు కష్టాలపాలవ్వరు. ఈ డైలాగ్ ఆఖరుకి హీరో ఓ సెల్ కంపెనీ ఓనర్ కి కూడా చెబుతుంది. గజిని సినిమాలో ఆసిన్ నటనకు తెలుగు, తమిళ ప్రేక్షకులు అంతా ఫిదా అయ్యారు. అందుకే బాలీవుడ్ గజినిలో కూడా ఆమెను రిపీట్ చేశాడు మురుగదాస్.
ఆ సినిమాలో ఆ డైలాగ్ సినిమా కథకు కూడా యాప్ట్ అయ్యేలా బాగా రాసుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ సినిమాల్లో నటించిన ఆసిన్ ఆ తర్వాత పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది. తమిళ, తెలుగు భాషల్లో గజిని సినిమా చూసినప్పుడల్లా ఆసిన్ నటన అందరిని మెప్పిస్తుంది. త్వరగా కెరియర్ ముగించినా ఆ సినిమాతో ఆమె అందరి హృదయాల్లో మంచి స్థానం సంపాదించుకుంది.