ఆంధ్ర రాజకీయాలను ఊపేసిన అసలు సిసలైన పొలిటికల్ సినిమా అది..?

praveen

తెలుగు చిత్ర పరిశ్రమ లో  ఎన్నో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలు వస్తాయి అనే విషయం తెలిసిందే. అయితే ఎంత మంది దర్శకులు పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమాలకి మాత్రం  తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది.... ఆయన సినిమాలన్నీ ఎంతో సెన్సేషనల్ గా మారిపోతూ ఉంటాయి. రామ్ గోపాల్ వర్మ నిజజీవితంలోని పాత్రలను ఆధారంగా తీసుకొని ప్రతి ఒక్క సినిమాను తెరకెక్కిస్తాడు అన్న  విషయం తెలిసిందే. దీంతో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించే అన్ని సినిమాలపై కూడా వివాదాలు చెలరేగుతూనే ఉంటాయి. ఇలా ఫుల్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాగా వర్మ తెరకెక్కించిన సినిమా అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు. 

 


 ఈ సినిమా మొదటి నుంచి ఆంధ్ర రాజకీయాల్లో పెద్ద సంచలనమే సృష్టించింది అని చెప్పాలి. ముఖ్యంగా చంద్రబాబు ను ఓడించి జగన్ అధికారంలోకి రావడం అనే ఒక కాన్సెప్ట్ ను  తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు వర్మ . ఇక ఈ సినిమాకు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు  అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేసి సంచలనం సృష్టించారు రాంగోపాల్ వర్మ. దీంతో ఈ సినిమా టైటిలే ఆంధ్ర రాజకీయాల్లో పెద్ద దుమారం రేపింది, అయితే ఈ సినిమా టైటిల్ ను సినిమానూ టిడిపి నాయకులు తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. ఈ సినిమా విడుదలను అడ్డుకుంటామని శబదలు  చేశారు. ఈ సినిమా టైటిల్ కులాల మధ్య చిచ్చుపెట్టేలా  ఉంది అంటూ కోర్టులో పిటిషన్ కూడా వేశారు. 

 


 అయినప్పటికీ ఎక్కడ వెనక్కి తగ్గలేదు రామ్ గోపాల్ వర్మ. చివరికి హైకోర్టు ఈ సినిమా విడుదలను ఆపేయడం తో కాస్త వెనక్కి తగ్గి కమ్మ రాజ్యం లో కడప రెడ్లు అని ఉన్న  సినిమా పేరు కాస్త అమ్మ రాజ్యం లో కడప బిడ్డలు అని మార్చాడు. అయితే టైటిల్ అయితే చేంజ్ చేశాడు కానీ లోపల ఉన్న కంటెంట్ మాత్రం అలాగే ఉండిపోయింది. వైసీపీ పార్టీ అధికారంలోకి రావడం... జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఆ తర్వాత చంద్రబాబు కి భారీ షాక్ లు తగులుతుండటం.. ఆయన ప్రెస్టేషన్..  ఇవన్నీ తన సినిమాలు చూపించారు వర్మ. ఇక ఈ సినిమా ప్రమోషన్ ని కూడా ఎంతో వింతగా చేసి  ఈ సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చారు రాంగోపాల్ వర్మ. ఇలా ఈ సినిమా ఆంధ్ర రాజకీయాలను ఊపేసింది  అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: