నిన్ను కోరి సినిమాలో అది పినిశెట్టి జీవించేశాడు!

Durga Writes

నిన్ను కోరి.. నాని, అది పినిశెట్టి హీరోగా, నివేద థామస్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఎంతో అద్బుతంగా ఉంది. అన్ని రకాల ఎమోషన్స్ తో ప్రేమ గురించి.. ఆపైన పెళ్ళికి ఇచ్చిన విలువ గురించి ఎంతో అద్భుతంగా తీశారు ఈ సినిమా. అలాంటి ఈ సినిమాలో ఒక్కో పాత్ర ఒక్కో ఆణిముత్యం. ఇంకా ఈ సినిమాలో సెకండ్ హీరోగా నటించిన అది పినిశెట్టి ఎంత అద్భుతంగా నటించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

 

 

ప్రేమికుడిగా నాని ఎంత గొప్పగా ఎంత బాధ్యతగా నటించాడో.. అర్థం చేసుకొనే భర్తగా అది పినిశెట్టి అంతబాగా నటించాడు. క్యరెక్టర్ ఆర్టిస్ట్ గా అదరకొట్టాడు. సాధారణంగా ఎవరైనా సరే సినిమా చూస్తే హీరోకు సపోర్ట్ చెయ్యాలి అనుకుంటారు.. కానీ ఈ సినిమాలో ఆదికి చెయ్యాలి అనుకుంటారు.. పాత్రలో అంత డిమాండ్ ఉంది. అలానే ఆ పాత్రకు మరింత డిమాండ్ తెచ్చేలా అది పినిశెట్టి నటించాడు. 

 

 

ఇలా అద్భుతంగా నటించిన అది పినిశెట్టి ఒక్క ఈ సినిమాలోనే కాదు సరైనోడు సినిమాలో కూడా చాలా క్లాస్ విలన్ గా కనిపించి అందరిని అలరించాడు. వావ్ అనిపించే రేంజ్ లో విలనిజం చూపించాడు. ఇలా హీరోగా, విలన్ గా, క్యరెక్టర్ ఆర్టిస్ట్ గా అన్ని రకాలుగా అది పినిశెట్టి జీవించేశాడు. ఇలా అద్భుతమైన పాత్రలో నటించి అందరిని అలరించాడు.                   

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: